పేదల పక్షపాతి ఇందిరాగాంధీ
పెద్దపల్లిరూరల్: భారత మాజీప్రధాని ఇందిరాగాంధీ పేదల సంక్షేమానికి ఎంతగానో పాటుపడ్డారని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక ప్ర గతినగర్ వద్ద మంగళవారం ఇందిరాగాంధీ జ యంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమా ల వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, కౌన్సిలర్లు మల్లయ్య, సంప త్, నాయకులు ఉప్పు రాజు, శ్రీకాంత్, సారయ్యగౌ డ్, జగదీశ్, మస్రత్, శ్రీనివాస్, సంతోష్, శ్రీనివాస్, బొంకూరి అవినాష్, నర్సయ్య పాల్గొన్నారు.
పెద్దపల్లి సుందరీకరణపై ప్రత్యేక దృష్టి
పట్టణ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మున్సిపల్‌లోని పలువార్డుల్లో రూ.1.32 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీల పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. భవిష్యత్ లో తాగునీటి ఇబ్బందులు రాకుండా శాశ్వత చర్య లు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వ్య వసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూ ప, నాయకులు సారయ్య, రాజేందర్, మస్రత్, ఉ ప్పు రాజు, మాధవి, భిక్షపతి, మల్లయ్య, సంపత్, సుభాష్‌రావు, అమిరిశెట్టి సతీశ్, కొమ్ము సుధాకర్, పూదరి మహేందర్, తిరుపతి, ఎడెల్లి శంకర్, కటికెనపల్లి రవి, వేముల రాజు, సాయి పాల్గొన్నారు.
ఇందిరాగాంధీకి ఘననివాళి
గోదావరిఖని: నగర మేయర్ బంగి అనిల్‌కుమార్, నాయకులు బొంతల రాజేశ్, తిప్పారపు శ్రీనివాస్ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయకులు ముస్తఫా, లింగస్వామి, రమేశ్, సింహాచలం తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే విజయరమణారావు
Comments
Please login to add a commentAdd a comment