● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 1,18,260 క్వింటాళ్ల సన్నరకం ధాన్యానికి రూ.5,91,30,600 బోనస్ చెల్లించినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సన్నరకం క్వింటాలుపై రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తున్నామన్నారు. ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు 1,503 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించామని కలెక్టర్ వివరించారు.
అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉపాధ్యాయులకు సూచించారు. రాఘవాపూర్ జెడ్పీ హైస్కూ ల్‌లో ఉపాధ్యాయుల ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు కనీస విద్యాప్రమాణాలు అందేలా చూడాలన్నారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మాతృ మరణాలపై సమీక్ష
పెద్దపల్లిరూరల్: జిల్లాలో మాతృ మరణాల శాతం తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్‌వో) అన్న ప్రసన్నకుమారి సూచించారు. స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష లో ఆమె మాట్లాడారు. జిల్లాలో నాలుగు మా తృమరణాలు సంభవించాయని, అందుకు గల కారణాలపై చర్చించి పలు సూచనలు చేశారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్ శ్రీధర్, ప్రోగ్రాం ఆఫీసర్ వాణిశ్రీ, సదానందం, రమణ, స్రవంతి, శ్రీరాం, కిరణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment