50 పడకలతో మరో భవన నిర్మాణం
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఆవరణలో మరో 50 పడకల సామర్థ్యం గల భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన వివిధ నిర్మాణాలపై గురువారం క లెక్టర్ సమీక్ష నిర్వహించారు. గోదావరిఖని జనరల్ ఆస్పత్రి, మంథని, పెద్దపల్లి, నందిమేడారం పరిధి లో చేపట్టిన పనులను సత్వరమే పూర్తిచేయాలన్నా రు. జిల్లా ఆస్పత్రిని సందర్శించి అందుబాటులో ఉ న్నస్థలంలో మరో 50 పడకల కోసం భవనాల ని ర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఎస్‌ఈ దేవేందర్, డీఈ రవీందర్, సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
రూ.100 కోట్ల ధాన్యం కొనుగోలు..
జిల్లాలో ఇప్పటివరకు రూ.100 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. గతేడాది కన్నా ఈసారి 60 శాతం అధికంగా వడ్లు కొనుగోలు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 45,438 మెట్రిక్ ఽటన్నుల ధాన్యం కొనుగోలు చేసి 1,762 మంది రైతులకు రూ.25.10 కోట్లు చెల్లించామని ఆయన వివరించారు.
పీఎం అజయ్ పథకానికి దరఖాస్తు చేసుకోండి
జిల్లాలో పీఎం అజయ్ పథకం కింద లబ్ధిపొందేందుకు ఎస్సీ రైతులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. ప్రభుత్వం ద్వారా వ్యవసా య భూమి పొందిన ఎస్సీ కులాల లబ్ధిదారులు ప్రధానమంత్రి అనుచిత్ జాతి అభ్యుదయ యోజన పథకం కింద ఆయా భూముల్లో బోరుబావులు వేసి నీటివసతి కల్పించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ఇంకో 950 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
వచ్చే ఏడాది జనవరి వరకు జిల్లాలో మరో 950 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటాలని కలెక్టర్ కో య శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయిల్‌పా మ్ సాగుపై సమీక్షించారు. ఆయిల్‌పామ్ సాగుతో కలిగే ప్రయోజనాలు, లాభాలపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని సూచించారు. వ్య వసాయ, ఉద్యానవన శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ అన్నారు. సమావేశంలో ఉద్యానవన జిల్లా అధికారి జగన్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వెంటనే అన్‌లోడ్ చేయాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): రైస్‌మిల్లుల్లో ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్ చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక వసుంధర రైస్ మిల్లును ఆయన తని ఖీ చేశారు. కేటాయించిన కోనుగోలు కేంద్రాలు, సే కరించిన ధాన్యం తదితర అంశాలపై ఆరా తీశారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, అధికారులు రాజేందర్, మహేశ్ పాల్గొన్నారు.
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment