ముదిరాజ్‌ల సంక్షేమానికి కృషి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ముదిరాజ్‌ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెగడపల్లిలో గురువారం ము దిరాజ్ సంఘం లోగో, జెండా ఆవిష్కరించి మా ట్లాడారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి నాణ్యమైన చేపపిల్లల పంపిణీ చేస్తామన్నారు. ఇందుకు అనువు గా జలాశయాలు అభివృద్ధి చేస్తామన్నారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అ ధ్యక్షుడు గాజనవేన సదయ్య, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తూడి సదయ్య, పెండెం సతీశ్ పాల్గొన్నారు.
ట్రాన్స్‌కో ఎస్‌ఈగా మాధవరావు
పెద్దపల్లిరూరల్: ఎన్పీడీసీఎల్(ట్రాన్స్‌కో) సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్‌ఈ)గా కంకటి మాధవరా వు గురువారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ నుంచి పెద్దపల్లికి బదిలీపై వచ్చారు. పెద్దపల్లి ఎస్‌ఈగా పనిచేసిన బొంకూరి సుదర్శన్ నిర్మల్‌కు బది లీ అయ్యారు. మాధవరావుకు అధికారులు, నాయకులు, ఆయన స్వగ్రామం హన్మంతునిపేటకు చెందిన పలువురు అభినందనలు తెలిపారు.
ఆ ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దు
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని చె ప్పి రుసుం చెల్లించి డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని అగంతకులు చేస్తున్న ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోరారు. డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. ఇంటర్‌నెట్/మీ సేవా కేంద్రం, స్మార్ట్ ఫోన్‌లో సిటిజన్ బడ్డీ యాప్ లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాల కోసం రామగుండం నగర పాలక సంస్థ లైసెన్స్ విభాగంలో సంబంధిత అధికారి ఫోన్ నంబరు 99666 26680లో సంప్రదించాలని ఆమె సూచించారు.
24న ప్రజాపాలన వేడుకలు
మంథని: స్థానిక శివకిరణ్ గార్డెన్స్‌లో ఈనెల 24న ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి పౌర సంబంధాల అధికారి జగన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో వేడుకలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరవుతారని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment