మతోన్మాదశక్తులను తరిమేద్దాం
గోదావరిఖని: మతోన్మాదశక్తుల నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వామపక్ష పార్టీల నాయకులు కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం మతోన్మాద వ్యతిరేక సదస్సు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సీపీఎం కార్యదర్శి వై.యాకయ్య, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు నంది రామయ్య, సీపీఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ నాయకుడు కె.రాజన్న, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకుడు ఎం.శ్రీనివాస్ మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేస్తోందని దుయ్యబట్టారు. భారత రాజ్యాంగాన్ని ఖూనీచేస్తూ, ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొడుతోందని విమర్శించారు. మతం వ్యక్తిగతమని, కానీ మతం పేరిట రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. కులం, మతం, ప్రాంతం పేరిట పాలకవర్గ పార్టీలు ప్రజల ఆలోచనలను వక్రమార్గం పట్టిస్తున్నాయని మండిపడ్డారు. మహిళ లు, దళితులు, ఆదివాసీలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేద ని ఆరోపించారు. మతసామరాస్యాన్ని కాపాడ ట మే లక్ష్యంగా ముందుకు సాగాలని వారు కోరారు. వామపక్ష పార్టీల నాయకులు కె.కనకరాజు, ఎం.మహేశ్వరి, జూపాక శ్రీనివాస్, ఇ.నరేశ్, ఇ.రామకృష్ణ, గౌతమ్ గోవర్ధన్, వేల్పుల కుమారస్వామి, ఐ.కృష్ణ, రమేశ్, గుండేటి మల్లేశం, మోహన్, బి.అశోక్, ఉపేందర్, చంద్రశేఖర్, మేరుగు చంద్రయ్య, గుమ్మడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
వామపక్ష పార్టీల పిలుపు
Comments
Please login to add a commentAdd a comment