లోన్ ఇప్పిస్తామంటూ.. మాటల్లో దింపి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): లోన్ ఇప్పిస్తామంటూ వృద్ధ దంపతులను మాటల్లో దింపిన గుర్తు తెలియని దంపతులు వారి వద్ద నుంచి రూ.3 వేలు లాక్కొని, పరారయ్యారు. బాధితులు లబోదిబోమంటూ పో లీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపెల్లికి చెందిన సుంకరి మల్లయ్య–అమృత దంపతులు. గ్రామసభలు ప్రా రంభం కావడంతో ప్రభుత్వ పథకాల గురించి తెలు సుకునేందుకు మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. గుర్తు తెలి యని దంపతులు వీరిని గమనించి, వెంబడించారు . బస్టాండ్ వైపు వెళ్తుంటే వెనకాలే వెళ్లి, మాటలు కలి పారు. ప్రభుత్వ పథకాల సమాచారం కోసం వచ్చి నట్లు తెలుసుకొని, వారికి రూ.50 వేల లోన్ ఇప్పిస్తామని చెప్పారు. తర్వాత రూ.3 వేలు లాక్కొని, పారిపోయారు. బాధితులు రోదిస్తూ సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు వివరాలు తెలుసుకొని, నిందితుల కోసం గాలిస్తున్నారు.
రూ.3 వేలు లాక్కొని, పరారైన గుర్తు తెలియని దంపతులు
Comments
Please login to add a commentAdd a comment