అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు
ధర్మారం: రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు అందించే బాధ్యత తమదేనని ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంగళవారం ధర్మారం మండలం నందిమేడారంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని మాట్లాడా రు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అధికారులు ప్రకటించిన జాబితాలో పేర్లు లేకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దశల వారీగా నిరుపేదలకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామంలోని మహిళా సంఘాలకు సోలార్ ప్రాజెక్టు నిర్మాణం అమలు చేసేలా చర్యలు జరుగుతున్నాయన్నారు.
జాతీయస్థాయి క్రీడాకారులకు సన్మానం
జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికై న ధర్మారం మెడల్ స్కూల్ విద్యార్థులను మంగళవారం ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ సన్మానించి అభినందించారు. విద్యాలయంలోని 30 మంది రాష్ట్రస్థాయి, ఆరుగురు జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనడం హర్షణీయమన్నారు. మహారాష్ట్రలో ఈనెల 24 నుంచి జరిగే సాఫ్ట్‌బాల్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్న వైష్ణవికి ప్రయాణఖర్చులు అందిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment