బాలికా సాధికారతకు ఎన్టీపీసీ అండ
జ్యోతినగర్: బాలికాసాధికతకు ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టు అండగా ఉంటుందని జనరల్ మేనేజర్ అలోక్‌కుమార్ త్రిపాఠి అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లోని మిలీనియం హాల్‌లో బాలికాసాధికారత మిషన్–2024 శీతాకాలపు ఐదో రోజుల శిక్షణను ప్రారంభించారు. ఎన్టీపీసీప్రభావిత, పునరావాస ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల బాలికలకు వేసవిలో నెల రోజుల పాటు శిక్షణ అందిస్తున్నట్లు తెలి పారు. శిక్షణ పొందిన బాలికల్లో 10 మందికి ఇంటర్మీడియెట్ వరకు ఉచిత విద్య అందిస్తున్నామని వెల్లడించారు. బాలికలకు స్టడీ కిట్‌లు అందించారు. దీప్తి మహిళా సమితి ఉపాధ్యక్షురాలు జ్యోత్న్స, రూపా సింగరాయ్, హెచ్‌ఆర్ అధికారి ప్ర వీణ్ కుమార్ చౌదరి, కార్పొరేట్ కమ్యూనికేషన్ అ ధికారి రూపాలి రంజన్, సీఎస్సార్ అధికారులు సూర్యనారాయణ, క్రాంతిరెడి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment