ఆందోళన వద్దు.. పథకాలు అందిస్తాం
సుల్తానాబాద్‌రూరల్/జూలపల్లి: అర్హులందరికీ ప్ర భుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానా బాద్ మండలం గొల్లపల్లి, జూలపల్లి మండలం నా గులపల్లె, చీమలపేట, తెలుకుంట గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో మాట్లాడారు. పదేళ్లుగా రేషన్‌కార్డులు, ఇళ్లు ఇవ్వని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆందోళనలు మాని ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాల జాబితాలో పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, ఎవరూ ఆందోళన చెందొద్దని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడమే లక్ష్యమని అన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీఓ దివ్యదర్శన్, ఏవో డేవిడ్‌రాజు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment