పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
మంథని/జూలపల్లి: ప్రభుత్వం చేపట్టబోయే నాలుగు నూతన పథకాలకు అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి లబ్ధి చేకూరుస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం మంథని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వార్డు సభలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా అర్హులను ఎంపిక చేసి అమలు చేస్తారన్నారు. ప్రాథమికంగా ప్రకటించిన జాబితాలో ఒకటి రెండు మిస్ అయినా ఎటువంటి ఆందోళన అవసరం లేదని, దరఖాస్తు అందిస్తే వారం పది రోజులలో విచారించి పథకాల లబ్ధి చేకూరుస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఎవరికైన సొంత ఇళ్లు ఉండి సమాచారం ఇస్తే తొలగిస్తామన్నారు. అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని, అర్హులు ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేశ్, మున్సిపల్ చైర్‌పర్సన్ పెండ్రు రమ, మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఎంపికకే గ్రామసభలు
జూలపల్లి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా ఆందించేందుకు గ్రామసభలు ఏర్పాటు చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. చీమలపేటలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో మాట్లాడారు. లబ్ధిదారులను ప్రజల సమక్షంలో ఎంపిక చేయడంతో సలైన నిరుపేద లబ్దిదారులకు లాభం చేకూరుతుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి శిధిలావస్థకు చేరిన ప్రభుత్వ పాళశాల భవనాన్ని పరిశీలించారు. నూతన భవన నిర్మాణానికి సహకారం ఆందిస్తానని తెలిపారు. మండల ప్రత్యేకాధికారి వెటర్నరీ ఏడీ శంకర్, ఎంపీడీవో పద్మజ, తహసీల్దార్ స్వర్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ గండు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment