అందని ద్రాక్షలా అధిక పింఛన్
● 1995 నుంచి వివరాలు కావాలని
ఈపీఎఫ్‌వో మెలిక
● డిమాండ్ నోటీసు మేరకు అడిగిన సొమ్ము చెల్లించిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు
● కొందరి దరఖాస్తులు తిరస్కరణ
● ఉమ్మడి జిల్లాలో రిటైరైనవారు
సుమారు 4,800 మంది
హుజూరాబాద్: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో 11 ఆర్టీసీ రీజియన్లు ఉన్నాయి. సుమారు 48 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. మరో 30 వేల మంది ఉద్యోగ విరమణ పొందారు. వీరిలో 20 వేల మంది అధిక పింఛన్‌కు అనర్హులేతే.. సుమారు 10 వేల మంది ఎంపికయ్యారు. కానీ, పింఛన్ రాక కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నారు.
ఇష్టానుసారంగా మంజూరు..
రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఇచ్చిన డిమాండ్ లెటర్ ఆధారంగా రిటైర్డ్ ఉద్యోగులు గతేడాది ఏప్రిల్, మేలో డీడీలను ఈపీఎఫ్‌వోకు పంపించారు. అయితే, సీరియల్ ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా అధిక పింఛన్ మంజూరు చేస్తూ గత జూన్, జూలై నెలల్లో ఈపీఎఫ్‌వోకు పంపించినట్లు ఆరోపణలున్నాయి. జిల్లా కార్యాలయంలో 6 నెలలు గడిచినా పింఛన్ మంజూరు చేయడం లేదు. దీంతో పింఛన్ పొందకుండానే కొందరు చనిపోయారు. మరికొందరు అనారోగ్యానికి గురయ్యారు. ఇంకొందరు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
దాదాపు 200 మందికే..
సుప్రీంకోర్టు తీర్పు మేరకు 01.09.2014 నుంచి ఉద్యోగ విరమణ పొందిన వారిలో అర్హులైనవారు అధిక పింఛన్ కోసం ఈపీఎఫ్‌వోకు దరఖాస్తు చేశారు. రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పింఛన్ వస్తుందని ఆశపడ్డారు. నిబంధనల మేరకు ఒక్కొక్కరు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు డీడీల రూపంలో చెల్లించారు. వీరిలో దాదాపు 200 మందికే అధిక పింఛన్ అందుతోంది. కానీ, నేటికీ ఏరియర్స్ రావడం లేదంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment