350 బిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరంలో 350 బిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి, లక్ష్యాన్ని చేరుకుంది. మంగళవారం సంబంధిత వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని 295 రోజుల్లోనే సాధించింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11 రోజులు ముందు. ఎన్టీపీసీ 76.5 గిగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉండగా.. 9.6 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యంతో సహా 29.5 గిగావాట్ల సామర్థ్యం ఉంది. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
కొత్త వ్యాపారాల్లోకి అడుగు..
విద్యుదుత్పత్తితోపాటు ఎన్టీపీసీ ఈ–మొబిలిటీ, బ్యాటరీ నిల్వ, పంప్డ్ హైడ్రో నిల్వ, వేస్ట్ టు ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ సొల్యూషన్స్ వంటి వివిధ కొత్త వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టింది. కేంద్ర పాలిత ప్రాంతాలకు విద్యుత్ పంపిణీ కోసం బిడ్డింగ్‌లో సైతం పాల్గొంది. ఎన్టీపీసీ సంస్థ దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ యుటిలిటీగా నిలిచింది. దేశ విద్యుత్‌లో 1/4 వంతు అందిస్తోంది. థర్మల్, హైడ్రో, సోలార్, విండ్ పవర్ ప్లాంట్లతో దేశానికి విద్యుత్ సరఫరా చేస్తోంది.
ఎన్టీపీసీ రామగుండంది ప్రధాన పాత్ర
ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు దేశానికి విద్యుత్ అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. థర్మల్ విద్యుత్ 2,600 మెగావాట్లు, తెలంగాణ స్టేజ్–1లో 1,600 మెగావాట్లు, ఫ్లోటింగ్ సోలార్ 100 మెగావాట్లు, గ్రౌండ్ సోలార్ ప్రాజెక్టు 10 మెగావాట్ల విద్యుత్ అందిస్తోంది. తెలంగాణ స్టేజ్–2లో 2,400 మెగావాట్లతోపాటు ఫ్లోటింగ్ సోలార్ 56 మెగావాట్లు, 120 గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.
2024–25లో 295 రోజుల్లోనే లక్ష్యాన్ని చేరిన ఎన్టీపీసీ
Comments
Please login to add a commentAdd a comment