రాగంలో రాణిస్తున్న రక్తసంబంధీకులు
వేములవాడ: వారంతా రక్తసంబంధీకులు. తమలోని కళను, ప్రతిభను చాటిచెప్పుకునేందుకు వేములవాడ రాజన్న క్షేత్రం వేదికగా నిలిచింది. జగద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో తమ రాగంతో, మృదంగం వాయిస్తూ కళాభిమానులను కట్టిపడేస్తున్నారు. చైన్నెకి చెందిన ప్రముఖ గాయకులు, ప్రియ సిస్టర్స్‌గా పేరొందిన హరిప్రియ, శణ్ముఖప్రియ తమ గళంతో శభాష్ అనిపించుకుంటున్నారు. వేములవాడకు చెందిన పిన్ని–కూతురు ఉపాధ్యాయుల అపర్ణ–భావన తమ మధుర స్వరంతో కీర్తనలు ఆలపిస్తున్నారు. మైదుకూరుకు చెందిన కొండపల్లి నటరాజ్ మృదంగం, అతని సోదరుడు ఉదయ్‌కుమార్ సంగీత కీబోర్డు వాయిస్తూ ప్రతిభ చాటుకుంటున్నారు. విజయవాడకు చెందిన విష్ణుభట్ల సిస్టర్స్‌గా పేరొందిన సరస్వతి, కృష్ణవేణిలు తమ రాగంతో సభికులను ఆకట్టుకుంటున్నారు. ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, ప్రధాన అర్చకుడు శరత్‌శర్మ వారిని సత్కరించారు.
మృదంగం, సంగీత కీబోర్డుతో సోదరులు..
రాజన్న క్షేత్రం వేదికపై ప్రతిభ
శభాష్ అంటున్న కళాభిమానులు
Comments
Please login to add a commentAdd a comment