ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడుని పరామర్శించారు పవన్ కళ్యాణ్. వెనువెంటనే పొత్తు వుంటుందని ప్రకటించారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చిన వెనువెంటనే పవన్ కళ్యాణ్ వైఖరి, చంద్రబాబుని అరెస్ట్ చేసినపుడు ఏపీ బార్డర్ వద్ద పవన్ వైఖరి జైలు వద్ద పొత్తు ప్రకటన వీటన్నిటి వెనుక అమరావతి అంశంతో సంబంధం ఏమిటి అనే చిదంబర రహస్యం శోధించే ప్రయత్నం చేద్దాం
- భూములు ఇచ్చిన రైతులు : 29000 పైచిలుకు
- భూమి విస్తీర్ణం : 33,000 ఎకరాలు
- CRDA చట్టం ప్రకారం
- రోడ్లు, పార్కులు, ఎమినటీస్ 50% అనగా రమారమి 16,500 ఏకరాలు
- రైతుల వాటా : రమారమి 8,250 ఎకరాలు
- ప్రభుత్వ వాటా : రమారమి 8,250 ఎకరాలు
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే రాజధాని కొనసాగి వుంటే 25% ప్రభుత్వ మిగులు భూమి ఎకరాల విలువ 2,00,000 కోట్లకు చేరి వుండేది అన్నారు. ఆయన లెక్క ప్రకారం 8,250 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమి విలువ రూ. 2,00,000 కోట్లు అయినపుడు రైతులకి ఇచ్చిన వాటాష కూడా 25% కావున ఆ భూమి విలువ కూడా రూ.2,00,000 కోట్లకీ చేరి వుండాలి.
అంటే సీఎం జగన్ సూచించినట్టు ల్యాండ్ పూలింగ్ ద్వారా కాకుండా ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టినట్టు ఐతే రైతులకి అంగుళం భూమి కూడా ఇవ్వవలసిన ఆవశ్యకత వుండేది కాదు. అపుడు రైతుల వాటాగా చెబుతున్న భూమి విలువ 2,00,000 కోట్లు కూడా ఖజానాకి వచ్చేది కదా. జగన్మోహన రెడ్డి గారు ముందు చూపుతో 33,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధాని నిర్మించి తద్వారా పెరిగిల లాభాలు ఖజానాకి చేర్చి తద్వారా ప్రజలకి చేర్చాలని చూసిన విజనరీ కాదా చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ విధానం వలన ప్రభుత్వ ఖజానాకి రావలసిన రెండు లక్షల కోట్లు 29,000 పైచిలుకు రైతుల ముసుగలో దూరిపోయిన అస్మదీయులకి చేర్చాలని చూశారు. దీనిని స్కాం అనకుండా ఏమి అంటారు.
ల్యాండ్ పూలింగ్ కాకుండా భూసేకరణ చేసి వున్నట్టు ఐతే ఏమి జరిగేదో చూద్దాం
ప్రభుత్వ భూమి 33,000 ఎకరాలు ఒకే చోట లేదు కావున మేము భూసేకరణ దిశగా నిర్ణయం తీసుకున్నామనీ అది అమరావతి పరిసర ప్రాంతాల లోనే నిర్మించాలనేది ప్రభుత్వ నిర్ణయం అనేది ప్రభుత్వ వాదన.
2014లో అమరావతి గ్రామాల్లో ఓపెన మార్కెట్ లో భూమి విలువ ఏకరాకి 8-10 లక్షలు మాత్రమే వున్నది. ఇక రెవెన్యూ శాఖ వారి కార్డ్ విలువ ప్రకారం రిజిస్టర్ ఆఫీసు విలువ 2-3 లక్షలుగా వున్నది.
►2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజస్టర్ ఆఫేసులో నమోదైన విలువకి 2-3 రెట్లు ఇవ్వాలి అనగా ఎకరా నాలుగు నుండి తొమ్మిది లక్షలు విలూవ కట్టి చెల్లించాలి. ఐతే అది దాదాపు మార్కెట్ విలువ ఐన 10 లక్షల దరిదాపులకే చేరుతుంది. కావున రైతులు భూమి ఇచ్చేందుకు నిరాకరించే వారు.
►CRDA ల్యాండ్ పూలింగ్ చట్టం బదులు ఓపెన్ మార్కెట విలువకి రెట్టింపు అనగా ఎకరా ఇరవై లక్షలు ధర నిర్ధారించి చట్ట ప్రకారం మీ భూమి విలువ తొమ్మిది లక్షలుహమాత్రమే కానీ ప్రభుత్వం మీకు ఇరవై లక్షలు ఇవ్వాలని నిర్థారించినది అని ప్రతిపాదన పెట్టి వుంటే దాదాపు రైతులు అందరూ అంగీకరించే వారు. ఒకవేళ అంగీకరించని పక్షంలో ఏ చోట ఐతే రైతులు అటువంటి ప్రతిపాదనని అంగీకరించే వారో అక్కడే రాజధాని నిర్మించుకుని వుండాల్సింది. ఇలా ఎకరా ఇరవై లక్షల చొప్పున చెల్లించి వుంటే 33,000 ఎకరాల కొనుగోలుకి అయ్యే ఖర్చు 6,600 కోట్లు మాత్రమే అయ్యేది.
►చంద్రబాబు లెక్క ప్రకారం ప్రభుత్వ వాటా 25% భూమి విలువ రెండు లక్షల కోట్లు అయినపుడు రైతుల వాటా కూడా 25% కావున వారి వాటా విలువ కూడా రెండు లక్షల కోట్లే కావున నాడు రైతులకి రెట్టింపు ధరతో రూ.6,600 కోట్లు చెల్లించి మొత్తం భూమి రైతుల నుండి సర్వ హక్కులతో కైవశం చేసుకుని వుంటే మొత్తం ప్రభుత్వ భూమి అయి వుండేది. రైతులకి మార్కెట్ రేట్ చొప్పున చెల్లించిన రూ. 6,600 కోట్లు పోనూ నేడు ప్రభుత్వ ఖజానాకి రూ.1,93,400 కోట్లు మిగిలి వుండేవి. ప్రభుత్వ ఖజానాకి వెళ్ళ వలసిన ఈ రూ. 1,93,400 కోట్లు 29,000 మంది రైతులకి చట్టబధ్ధంగా బదిలీ చేయటం స్కాం అనకుండా ఏమి అంటారు ?
►ఇవి మాత్రమే కాకుండా పదేళ్ళ పాటు ఏటా చెల్లించ వలసిన కౌలు అదనంగా ఖజానా పై దాదాపు రూ.1800 కోట్ల భారం ప్రభుత్వం పైన పడినది. ఔట్ రైట్ భామి కొని వున్నట్టు ఐతే ఖజానాపై ఈ భారం పడేది కాదు. ప్రభుత్వ ఖజానాకి రావలసిన లక్షల కోట్ల రూపాయలు రైతుల పేరిట భూస్వాములకి దోచిపెట్టడాన్ని స్కాం అనేందుకు విపక్షాల నోరు ఎందుకు రావటం లేదో అంతపట్టని అంశం.
తెలుగుదేశం నాయకులు చెబుతున్న కుంటి సాకులు
►2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావున ప్రభుత్వ ఖజానాలో 33,000 ఎకరాల కొనుగోదుకి చెల్లించవలసినంత డబ్బు లేదు అని. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి సంవత్సరం భడ్జట్ 1,11,823 కోట్లు కాగా మరుసటి సంవత్సర బడ్జట్ 1,13,049 రెండు సంవత్సరాల బడ్జట్ కలిపితే 2,24,872 కోట్లు. ఈ బడ్జట్ నుండి 6,600 కోట్లు తీయటం పెద్ధ సమస్య ఏమీ కాదు. రాజధాని నిర్మాణ నిర్ణయం డిసెంబరులో తిసుకున్నందున రైతులకి చెల్లించవలసిన డబ్బు రెండు ఆర్థిక సంవత్సరాల లోపు చెల్లించాలి అని నిర్ణయం తీసుకున్నా అనగా 2014-15 & 2015-2016 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్ కేటాయింపులలో పరిగణలోకి తీసుకున్నా పెద్ద కష్టమైన అంశం కాదు. 2018-2019 బడ్జట్ 1,91,064 కోట్ల నుండి 20,000 కోట్లు పసుపు కుంకుమ కోసం సునాయసంగా తీయగలిగారు.
రైతులు ఇచ్చిన భూమిలో రాజధాని కడితే ఆ లాభాలలో ప్రభుత్వ ఖజానాకి హక్కు వుంటుందా ?
►రాజధాని ప్రకటనకి పూర్వం అమరావతిలో భూమి విలువ ఎకరా 8-10 లక్షలు మాత్రమే. అక్కడ రాజధాని కట్టాలంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, రాజ్ భవన్, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేల, అధికారులు ప్రభుత్వ సిబ్బంది తదితర నివాస గృహాలు నిర్మించాలి. అనగా అవి ప్రభుత్వ ఆస్తులు అంటే ఐదు కోట్ల మంది ప్రజల ఆస్తులు.
►అక్కడ ఐదు కోట్ల మందికి చెందిన ఆస్తులు అయినాప్రభుత్వ భవనాల కట్టడం వలన ఆ భూమి విలువ పెరిగిందే తప్ప ఆ భూముల విలువ అమానతంగా పెరిగిపోవటానికి కోహినూర్ వజ్రాల గనులు లేదా బంగారు గనులు ఏమీ లేవు. ఐదు కోట్ల మందికి చెందిన ప్రభుత్వ భవనాల నిర్మాణం వలన భూమి విలువ అనూహ్యంగా పెరిగితే దాని లాభం హకాకు ప్రభుత్వ ఖజానాకే చెందుతుందని కానీ ఆ లాభాలలో రైతులని భాగస్వాములు చేయటం ఖజానాకి ద్రోహం చేయటమే.
►భూములు ఇచ్చినందుకు రైతులకి మార్కెట్ ధర కంటే రెట్టింపు ఇవ్వటం పూర్తిగా న్యాయబధ్ధం.
►ఒకవేళ రైతులు తాము వ్యవసాయమే చేస్తాము అని కోరితే అదే సారవంతమైన భూమి అవే పంటలు పండే భూమి రాజధాని పరిధి బయట ఎకరాకి రెండెకరాలు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించి వుండవలసినది.
నిజంగా రైతులది త్యాగమా ?
►ప్రభుత్వ అనుకూల మిడియాలో రైతులు ఇచ్చిన భూమిలో 25% కి మాత్రమే ప్రతిఫలం తీసుకుని 75% భూమి త్యాగం చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. చూడటానికి ఇది నిజమే కదా అని అనిపించినా దీని వెనుక అసలు మతలబు ఏమిటి అసలు మర్మం ఏమిటో ప్రజలు తెలుసుకోవాలి.
►రైతులు కేవలం 25% భూమిని మాత్రమే తిరిగి పొందుతున్నప్పటికీ మిగిలిన 75% భూమిలో ఏమి చేస్తున్నారో రైతులు కానీ టీడీపీ కానీ వారి అనుకూల మీడియా కానీ చెప్పరు. ఆ 75% భూమిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, రాజ్ భవన్ గవర్నర్, ముఖ్యమంత్రి నివాసాలు, ప్రభుత్వ భవనాలు, ఉన్నతాధికారులు సిబ్బంది భవనాలు, రోడ్లు, పార్కులు, భవనాలు కట్టడం వలన భూమి విలువ అమాంతంగా పెరిగిపోతుంది. అక్కడ ఎకరా 10 లక్షల నుండి 20 కోట్లకి చేరుతుంది. అంటే వారి వాటా కింద వచ్చే 25% భూమి విలువ 5 కోట్లకి చేరుతుంది. రాత్రికి రాత్రి తమ భూమి విలువని 10 లక్షల నుండి ఐదు కోట్లకి అంటే అమాంతంగా 50 రెట్లు పెంచుకుని కోట్లాది రూపాయలు సంపాదించుకునేందుకు 75% శాతం భూమి అందజేస్తామన్నారు కాని ఏదో రాష్ట్రానికి దానం చేసేందుకు కాదు త్యాగం అంతకంటే కాదు.
►దురదృష్టవశాత్తు భూమి ఇచ్చి కోట్ల లాభం పొందే స్కీం ని సైతం రైతులు చేస్తున్న త్యాగం అని అభివర్ణించటంలో టీడీపీ ఎల్లో మీడియా ప్రచారం చేయటంలో నవరసాలు ఒలికించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సీఎం జగన్‌పై అంత ద్వేషం ఎందుకు పెంచుకున్నారు అనే విషయానికి వధ్ధాము.
►2019 ఎన్నికలకు పూర్వం ప్రచారంలో భాగంగా కర్నూలు వెళ్ళిన పవన్ కళ్యాణ్ కర్నూలే నా మనసుకి రాజధాని అన్నారు. విశాఖపట్నం వెళ్ళినపుడు విశాఖ రాజధాని అయితే బావుండేది అన్నారు. అమరావతి ఒక సామాజిక వర్గానికి గేటెడ్ కమ్యూనిటీ అయిపోయింది అన్నారు. వాస్తవానికి జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన వెనువెంటనే పవన్ కళ్యాణ్ ఒక నిలువెత్తు బొకే వెంట తీసుకుని జగన్‌మోహన్‌రెడ్డి గారిని కలిసి కౌగిలించుకుని లేదా కనీసం ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి. ‘‘మీ నిర్ణయం నా ఆలోచనలకి దగ్గరగా వున్నది, కర్నూలే నా మనసుకి రాజధాని అని ఆ ప్రజలతో చప్పట్లు కొట్టించుకున్నాను అక్కడ హైకోర్టు పెడుతున్నారు, విశాఖలో అదే మాట చెప్పాను అక్కడ సెక్రటేరియట్ కడుతున్నారు, అమరావతి ఒక కులానికి గేటెడ్ కమ్యూనిటీ అయిపోయింది అన్నాను అక్కడ అన్ని కులాలకి చెందిన యాభై వేలమందికి గృహాలు నిర్మించి ఇస్తున్నారు. ధన్యవాదములు’’ అని చెప్పాలి.
►ప్రజల ముందు చెప్పిన దానికి పూర్తి భిన్నంగా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఎన్నికలకి పూర్వం తాను చెప్పిన ఆలోచలనలని అమలు చేస్తున్నందుకు సంతోషించవలసిన పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి గమనిస్తే షాక్‌కు గురిచేస్తోంది. మూడు రాజధానుల ప్రకటన వచ్చిన వెంటనే అమరావతి చేరుకున్నాడు. చేతులు విసిరాడు, జుట్టు ఎకరేసాడు, తల ఎగరేశాడు, కంచెలు దూకాడు, పోలీసులపై విరుచుకు పడ్డాడు. ఏదో కోల్పోయిన వాడిలా, మతిస్థిమితం కోల్పోయిన వాడిలా, మతిస్థిమితం కోల్పోయి, మానసిక సమతుల్యం కోల్పోయి, ఒకే రోజు యావదాస్తి కోల్పోయిన స్టాక్ బ్రోకర్ వలె ఉన్నది ఆ రోజు ఆయన వ్యవహార శైలి. అంతకు మునుపు కర్నూలు లో రాజధాని అనీ, విశాఖలో రాజధాని అనీ అమరావతి ఒక కులానికి గేటెడ్ కమ్యూనిటీ అన్న పవన్ కళ్యాణ్ ని మూడు రాజధానుల ప్రకటన అంతలా ఎందుకు కలవరపెట్టినది అంతగా ఎందుకు ఖంగుతిన్నాడు అంతలా ఎందుకు బెంబేలెత్తిపోయాడు అనేది రాష్ట్ర ప్రజలు ఆలోచించవలసిన అంశం.
►మూడు రాజధానుల ప్రకటన వచ్చిన పిదప అమరావతిలో చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేసిన పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఢిల్లీ పరుగులు పెట్టాడు. ఎన్నికల ముందు మోదీ సహా బీజేపీ నాయకులని బండబూతులు తిట్టిన బీజేపీ పెద్దలని కలిసేందుకు అపాయింట్మెంట్ కోసం నానా ప్రయత్నాలు చేశాడు. అపాయింట్మెంట్ దొరక లేదు. మోదీ దృష్టిని ఆకట్టుకునేందుకు మాజీ సైనికుల సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించి ఇచ్చినది సైనికుల సహాయ నిధికి ఐతే ఎందుకో గానీ మోదీని ట్యాగ్ చేస్తూ నేను మాజీ సైనికుల సహాయ నిధికి కోటి విరాళం ఇచ్చానని ట్వీట్ కూడా చేశాడు.
►అదేమిటో గానీ పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో సైనికులు మరణించినపుడు గానీ, జమ్మూ కాశ్మీర్ లోని ఉరి ఉగ్రవాద దాడిలో 18 మంది సైనికుల జరిగి సైనికులు మరణించినపుడు గానీ, పుల్వామా దాడిలో 44 మంది సైనికులు మరణించినపుడు గానీ మాజీసైనికుల సహాయనిధికి డబ్బు ఇవ్వాలనే ఆలోచన రాని పవన్ కళ్యాణ్ మూడు రాజధానుల ప్రకటన వచ్చిన పిదప మోదీ అపాయింట్మెంట్ దొరకక తిప్పలు పడుతున్నపుడు సైనికుల మీద అమాంతం ప్రేమ పుట్టుకువచ్చినది. ఏదేమైతేనేమీ ఎట్టకేలకు బీజేపీతో పొత్తు కుదిరింది. ఆరు నెలల పిదప వైసీపీ కూడా ఎన్డీఏలో చేయనున్నదని ఊహాగానాల నేపథ్యంలో విలేకరులు పవన్ కళ్యాణ్ని ఎన్డీఏ లోకి వైకాపా చేరితే మీరు వుంటారా లేక వైదొలగుతారా అని అడుగగా వైకాపా ఎన్డీఏలో చేరితే మేము ఎందుకు వుంటాము మేము పొత్తు పెట్టుకున్నది మూడు రాజధానుల ప్రకటన రద్దు చేయించేందుకు అన్నారు.
►ఇది నా నేల అంటూ డబ్బా కొట్టే పవన్ కళ్యాణ్ ప్రత్యేకహోదా కోసమో కాదు ఏ పోలవరం నిధుల కోసమో కాదు మూడు రాజధానుల ప్రకటన రద్దు చేయించేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడంటే అతనికి అమరావతిలో ఉన్న ఆసక్తి ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలి.
అంత ఆఘమేఘాల మీద ఢిల్లీ పరుగులు పెట్టి పొత్తు పెట్టుకోవలసినంత కొంపలు అంటుకుపోయే కారణాలు ఏముంటాయి ?
►చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు తనకూ మంచి మిత్రుడు, జనసేన విజయవాడ కార్యాలయం యజమాని, జనసేన మంగళగిరి కార్యాలయం లేఔట్ వేసిన వ్యక్తి అన్నీ ఒకరే ఐన లింగమనేని చంద్రబాబు సహా చాలా మందికి బినామీ అంటారు. మూడు రాజధానుల ప్రకటన పిదప పవన్ కళ్యాణ్ కలవరం, ఆపై అనునిత్యం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇతర వైసీపీ నాయకులపై అక్కసు వెళ్ళగక్కటానికి కారణం మూడు రాజధానుల ప్రకటన అనే అనుమానం బలపరుస్తుంది. ఇవన్నీ పరిశీలిస్తే పవన్‌కి మూడు రాజధానుల ప్రకటన వలన కోలుకోలేని దెబ్బ తగిలింది అని భావించాలి.
►పరిటాల శిరోముండనం, శ్రీజ వివాహం దుష్ప్రచారం, మా బ్లడ్డు వేరు బ్రీడు వేరు అనీ, అలగాజనం సంకరజాతి జనం వంటి ఆత్మాభిమానం చంపేసేలా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, ఆఖరికి కన్న తల్లిని దూషించిన వారినే వెనకేసుకువస్తున్నాడంటే వాటన్నిటీని మరిచిపోయి మైమరపించే అంశం అమరావతిలో ఏమై వుంటుందా అన్నది ప్రజలే గ్రహించాలి.
►అమరావతి అంశంలో చంద్రబాబుని విపక్షాలు ఎందుకు సమర్థిస్తున్నాయి.. అమరావతి అంటే ప్రభుత్వ ఖజానాని దోచి 29,000 మంది రైతులకి దోచి పెట్టడమే అని పైన వివరించిన అంశాలు తెలియక మునుపు విపక్షాలు చంద్రబాబుని సమర్థించి వుంటే పొరపాటు. కానీ ల్యాండ్ పూలింగ్ అనేది ప్రభుత్వ ఖజానా నుండి కోట్ల రూపాయలు దోచి 29,000 మందికి పంచటమే అని తెలిసిన పిదప కూడా ఇకపై దానిని విపక్షాలు సమర్థిస్తే వారికి కూడా అమరావతి దోపిడీ దారుల నుండి గణనీయమైన ముడుపులు అందుతున్నాయని భావించాల్సి వుంటుంది.
►టీడీపీ జనసేన పొత్తులు అసలు మతలబు అమరావతిలో రాజధాని కడితే చంద్రబాబు అనుయాయులకి లక్షల కోట్ల లబ్ధి చేకూరనున్నది మనం చూశాము. పవన్ కళ్యాణ్ కలవరపాటు చూశాము.
►స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబుని అరెస్టు చేసిన వెంటనే ఫ్లైట్ లో వద్దామని ప్రయత్నించి కుదరక హుటాహుటిన బయలు దేరిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర సరిహద్దు వద్ద చేసిన విన్యాసాలలో కూడా కంగారు కలవరపాటు కనపడ్డాయి. చంద్రబాబు జైలుపాలైతే అమరావతి ఆశలు అడియాశలే అనే ఆదుర్దా వలన ఆ చిత్రవిచిత్రమైన విన్యాసాలకి కారణమా అనే అనుమానం రాక మానదు.
►ఆఘమేఘాల మీద రాజమండ్రి జైలు సందర్శన పొత్తుల ప్రకటన చంద్రబాబు పవన్ కళ్యాణ్ లలో ఆందోళన ఏ స్థాయిలో వున్నదో చెబుతున్నది. ఆఘమేఘాల మీద పొత్తు ప్రకటనకి అసలు కారణాలు అవే అన్న అనుమానం రాకమానదు.
అమరావతి భూముల కోసం అవసరమైతే పవన్ కళ్యాణే సీఎం
►చంద్రబాబు & అనుచర గణం ఉచ్వాసనిశ్వాసలు అధికారంతో ముడిపడి వుంటాయి. ఐతే అంతకుమించిన మమకారం అమరావతి ఆస్తుల పైన వుంటుంది. అమరావతిలో కేవలం భూమి సేకరణ కోసం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానం లోనే లక్షల కోట్ల రూపాయల స్కాం అని మన అధ్యయనంలో తేలిపోయింది. ఇక ప్రభుత్వం వాటా కింద వచ్చిన 25% భూమి ఎవరెవరికి ఏయే రేట్లలో కేటాయించాలి అనే అంశంలో మరో భారీ అవినీతి వుంటుంది.
►అలాగే శాశ్వత సెక్రటేరియట్, శాశ్వత అసెంబ్లీ & శాశ్వత హైకోర్టు నిర్మాణంలో భారీగా దోచుకునే ఆస్కారం వున్నది. ఏపీ తాత్కాలిక సెక్రటేరియట్ ఖర్చు కంటే తక్కువ. అంతకు పన్నెండు రెట్లు పెద్దది అయిన భారత నూతన పార్లమెంట్ భవనం విస్టా పూర్తి చేశారు. ఏపీ సెక్రటేరియట్ ఖర్చులో 60% తో అంత కంటే 5 రెట్లు పెద్దది ఐన తెలంగాణ సెక్రటేరియట్ పూర్తి చేశారు. దీనిని బట్టి అమరావతే రాజధానిగా వుంటే ఏ స్థాయిలో దోపిడీ జరిగేదో మనం ఊహించ వచ్చు. జగన్‌మోహన్‌రెడ్డిని ఓడిస్తేనే అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగుతుంది. పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి అనిపించినపుడు అవసరమైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ని సీఎం అని ప్రకటించినా ఆశ్చర్యం లేదు.
ఒకసారి ఒప్పందం చేసుకున్నాక రద్దు చేయకూడదా ?
►ప్రభుత్వ ఖజానాకి గండికొట్టే ఏ అంశం ఐనా అవినీతి కిందకే వస్తుంది. ఐతే అవినీతి దాగి ఉన్న దానిలో ఒప్పందం జరిగిపోయినది కావున దానిని అలాగే కొనసాగించాలి అనే వాదన దివాలాకోరు దగుల్బాజీ రాజకీయాలకి నిదర్శనం. 2G స్పెక్ట్రం కేసులో టెలీకాం ఆపరేటర్లు అందరూ కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకి రావలసిన ఆదాయానికి గండి కొడుతున్నారు అనే ఆరోపణల నేపధ్యంలో ఒప్పందాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయటం జరిగినది. ఇక్కడ కూడా ప్రభుత్వ ఖజానాకి లక్షన్నర కోట్ల నష్టం వాటిల్లుతున్నందున CRDA ల్యాండ్ పూలింగ్ రద్దు చేయాల్సిన ఆవశ్యకత వున్నది.
►త్వరలో ఈ సమాచారం మొత్తం "అరచేతిలో అమరావతి అవినీతి ఆధారాలు" పేరుతో కరపత్రంగా ముద్రించి యావత్ రాష్ట్ర ప్రజలకి నిజానిజాలు తెలియచెప్పే ప్రయత్నం చేస్తాను.
►ఈ ప్రయత్నంలో ప్రభుత్వ యంత్రాంగం, వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలు, ZPTCలు, MPTCలు, సర్పంచులు వార్డు సభ్యుల ప్రజాప్రతినిధులు ఈ మెగా భూ కుంభకోణం కరపత్రాలుగా ముద్రించి ప్రజలకి అందుబాటులోకీ తెచ్చినా లేక వారి పరిధిలోని గ్రామాల కూడళ్ళ వధ్ధ భారీ హోర్డిగులు ఏర్పాటు చేసి ప్రదర్శించిన ఎడల ప్రజలకి నిజానిజాలు తలుస్తాయి.
-చింతా రాజశేఖర రావు, పొలిటికల్ అనలెస్ట్
Comments
Please login to add a commentAdd a comment