సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 16తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదివారమే జాబితా వెలువడుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆశావహులంతా ఆది వారం రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ అధినేత నుంచి సమాచారం వస్తుందని ఎదురుచూశారు.
గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, మధుసూదనాచారికి సీఎం కార్యాలయం నుంచి పిలుపు వచ్చిందనే ప్రచారం కూడా జరిగింది. దీంతో తాము ఆశావహుల జాబితాలో ఉన్నప్పటికీ అభ్యర్థిత్వం ఖరారుపై ఎలాంటి సమాచారం అందలేదని వారు ధ్రువీకరిం చారు. మంగళవారం గడువు ముగియనుండటంతో సోమవారం జాబితా వెలువడుతుందని భావిస్తున్నారు. స్థానిక సంస్థల కోటా లో 12 స్థానాలకు ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment