మేమంతా టీడీపీనే.. మాకు మేలు జరిగింది | Sakshi
Sakshi News home page

మేమంతా టీడీపీనే.. మాకు మేలు జరిగింది

Published Mon, May 6 2024 9:40 AM

మేమంత

టీడీపీకి కాస్త పట్టున్న దొడ్డవరంలో ప్రభుత్వ పనితీరుపై జనాభిప్రాయం తెలుసుకునేందుకు ప్రయత్నించాం. ఊరి నడిబొడ్డున గుడి వద్ద కూర్చుని ఉన్న ఇద్దరు వ్యక్తులతో మాటలు కలిపాం. ‘‘మా ఊర్లో తెలుగుదేశం వారే ఎక్కువ. మేమూ తెలుగుదేశమే. మా పిల్లలు చదువుకున్నారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. నాకు పింఛను వస్తోంది. మా పిల్లల్లో ఒకరు వలంటీర్‌గా చేస్తున్నారు. కుటుంబం సాఫీగా నడుస్తోంది. ఏ పార్టీ అయితేనేమి నాకు మేలు జరిగింది. ఆ కృతజ్ఞత అలాగే ఉంటుంది’’ అని ముక్తాయించారు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పెద్దాయన.

‘‘రాజశేఖరరెడ్డి పాలన చూశాం. ఆయన కొడుకు జగన్‌ పేదోళ్ల గురించి అంతకు మించి ఆలోచన చేస్తున్నాడు. చంటి పిల్లల దగ్గర నుంచి పండు ముసలోళ్ల వరకు ఏదో ఒక పథకం బీదా బిక్కికి అందించాడు. కరోనా వచ్చినపుడు దేశమంతా జనం పిట్టల్లా రాలిపోతున్నా మన దగ్గర ఆస్పత్రుల్లో బాగా చూసుకున్నారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు చాలా బాగున్నాయ్‌..’’

ఇదీ 70 కిలో మీటర్ల మేర సాగిన ‘సాక్షి రోడ్‌ షో’లో ఓటర్ల హృదయ స్పందన. సంక్షేమ పథకాలు అందించడంలో వైఎస్‌ జగన్‌ను ఢీకొట్టాలంటే అటు వైపు కూడా జగనే ఉండాలన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమైంది. – ఎన్‌.మాధవరెడ్డి, సాక్షి ప్రతినిఽధి, ఒంగోలు

ఆర్‌బీకే, గ్రామ సచివాలయం, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ సెంటర్లు

● అక్కడ నుంచి కాస్త దూరంలో ఉన్న మరో వృద్ధురాలు మస్తానమ్మను కదిలిస్తే.. ‘‘పింఛను, చేయూత, డ్వాక్రా రుణమాఫీ, జగనన్న ఇళ్లు వచ్చాయి. ఎంత మంది కలిసినా మళ్లీ వచ్చేది జగనే’’ అంటూ రెట్టించిన ఉత్సాహంతో చెప్పింది.

నా బిడ్డకు ఉచితంగా గుండె ఆపరేషన్‌ చేశారు

కూలీ పనిచేసుకొని జీవనం సాగించే నాకు పెద్ద కష్టం వచ్చి పడింది(కన్నీళ్లు పెట్టుకుంటూ). నాకు ఇద్దరు కుమారులకు గుండెలో రంద్రాలు పడ్డాయని డాక్టర్లు చెప్పారు. వైద్యం చేయించడయ్యా అని టీడీపీ ప్రభుత్వంలో అధికారుల చుట్టూ, నాయకుల చుట్లూ, ఆస్పత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగా. ఎవరూ పట్టించుకోలేదు. జగనన్న సీఎం అయ్యాక ఆరోగ్య శ్రీలో మా పెద్దబ్బాయికి గుండె ఆపరేషన్‌ చేశారు. చిన్నబ్బాయికి కూడా త్వరలోనే ఆపరేషన్‌ చేస్తామని చెప్పారు.

– నాసర బాబు, కురిచేడు

మేమంతా టీడీపీనే.. మాకు మేలు జరిగింది
1/4

మేమంతా టీడీపీనే.. మాకు మేలు జరిగింది

మేమంతా టీడీపీనే.. మాకు మేలు జరిగింది
2/4

మేమంతా టీడీపీనే.. మాకు మేలు జరిగింది

మేమంతా టీడీపీనే.. మాకు మేలు జరిగింది
3/4

మేమంతా టీడీపీనే.. మాకు మేలు జరిగింది

మేమంతా టీడీపీనే.. మాకు మేలు జరిగింది
4/4

మేమంతా టీడీపీనే.. మాకు మేలు జరిగింది

Advertisement
Advertisement