జన్మభూమి కమిటీలతో టీడీపీ దోపిడీ | - | Sakshi
Sakshi News home page

జన్మభూమి కమిటీలతో టీడీపీ దోపిడీ

Published Sat, May 11 2024 8:30 AM | Last Updated on Sat, May 11 2024 8:30 AM

జన్మభూమి కమిటీలతో టీడీపీ దోపిడీ

సింగరాయకొండ(మర్రిపూడి): టీడీపీపై నమ్మకం లేదని ఆ పార్టీని వీడి పలు కుటుంబాలు వైఎస్సార్‌ సీపీ కండువాలు కప్పుకుంటున్నాయని, సింగరాయకొండ, టంగుటూరు మండలాల్లో పార్టీలో చేరికలు బాగా పెరిగాయని కొండపి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పాకల టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న 30 కుటుంబాలకు చెందిన 150 మంది వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరికి మంత్రి సురేష్‌ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ గత రెండు రోజల్లో పాకల నుంచి 150 మంది, టంగుటూరు నుంచి 21 కుటుంబాల వారు టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరారన్నారు. గతంలో టీడీపీ హయాంలో పేదలకు సంక్షేమ పథకాలు అందక జన్మభూమి కమిటీలు నిత్యం అడ్డుపడి దోచుకున్నారని ఆరోపించారు. జగనన్న ప్రభుత్వంలో వలంటీర్ల సహకారంతో రాజకీయాలకు, నాయకులకు సంబంధం లేకుండా నేరుగా పేదలకు సంక్షేమ పధకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్‌ సీపీ పనిచేసిందని గతంలో టీడీపీ కారణంగా రాష్ట్రం చిన్నా భిన్నమైందని ఆరోపించారు. పెత్తందార్ల టీడీపీ పాలనలో ఉండలేమని ఆ పార్టీ నాయకులు వైఎస్సార్‌ సీపీలోకి చేరుతున్నారన్నారు. సోమవారం జరిగే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌లను ఫ్యాన్‌ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పాకల గ్రామ కమిటీ అధ్యక్షుడు కేశవరపు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాకలలో టీడీపీకి భారీ షాక్‌

మంత్రి సమక్షంలో 150 మంది చేరిక

పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి సురేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement