● వైఎస్సార్ సీపీ
ప్రత్యేక బృందాల ఏర్పాటు
ఒంగోలు సిటీ: అక్రమ నిర్బంధాలు, అరెస్ట్‌లకు గురవుతున్న వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉండేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరఫున ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, కేవీ రమణారెడ్డిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ బృందం సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం అందించడంతో పాటు వారికి, వారి కుటుంబాలకు భరోసా ఇవ్వనుంది. జిల్లాలోని పార్టీ నేతలు, లీగల్ సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ బృందం పనిచేయనుంది.
బాలల చట్టాలపై
అవగాహన కలిగి ఉండాలి
● అధికారులతో
కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు అర్బన్: బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టాలపై అధికారులందరికీ సమగ్రమైన అవగాహన ఉండాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. బంగారు బాల్యం కార్యక్రమం నేపథ్యంలో బాలల హక్కుల చట్టాలపై జిల్లా స్థాయి అధికారులకు గురువారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చట్టాలతో పాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు కావాల్సిన అర్హతలపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. దీనిపై అధికార యంత్రాగానికి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహస్తున్నట్లు తెలిపారు. న్యాయ, కార్మిక, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష చట్టం, పోక్సో, విద్యా హక్కు చట్టాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రవిశంకర్, రాఘవులు వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఓబులేసు, ఐసీడీఎస్ పీడీ మాధురి, ఉప విద్యాశాఖాధికారి సుబ్బారావు, కనిగిరి, ఒంగోలు ఆర్డీఓలు కేశవర్దన్‌రెడ్డి, లక్ష్మీప్రసన్న, వీవీ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment