పాత డీఎస్సీ అభ్యర్థులకు
న్యాయం చేసిన జగన్...
1998, 2008 సంవత్సరాలలో నిర్వహించిన డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు అప్పటి ప్రభుత్వాలు అన్యాయం చేశాయి. ఎన్నిసార్లు ప్రభుత్వాలను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న దాఖలాల్లేవు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారందరికీ న్యాయం జరిగింది. ఏళ్ల తరబడి పోస్టింగ్‌ల కోసం ఎదురుచూసిన వారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగాలిచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1998 డీఎస్సీకి సంబంధించి 175 మందికి ఉద్యోగాలు ఇవ్వగా, వీరు 2023 ఏప్రిల్ 12న ఉద్యోగంలో చేరారు. అలాగే 2008 డీఎస్సీకి సంబంధించి 106 మందికి పోస్టింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment