సంప్రదాయ క్రీడల్లో విద్యార్థినులు రాణించాలి
ఒంగోలు: నేటి కంప్యూటర్ యుగంలో విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని, పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు చదువుతోపాటు సంప్రదాయ క్రీడలు ఎంతో అవసరమని ఆంధ్రకేసరి యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఏకేయూ ప్రాంగణంలో నిర్వహించిన మహిళల అంతర్ కళాశాలల మహిళల కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోటీలను యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.రాజమోహన్‌రావు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డీడీ డాక్టర్ ఐ.దేవీ వరప్రసాద్‌తో కలిసి రిజిస్ట్రార్ ప్రారంభించారు. 8 కళాశాలలకు చెందిన 24 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. మంగళవారం నిర్వహించిన పోటీలు హోరాహోరీగా సాగాయి. ఫైనల్స్ అనంతరం ఏకేయూ తరఫున పాల్గొనే జట్టును ఎంపిక చేయనున్నారు. ఏకేయూ కాలేజ్ డెవలపెమెంట్ కౌన్సిల్ డీన్ ప్రొఫెసర్ జి. సోమశేఖర, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. వివిధ కళాశాలల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీలను ఆసక్తిగా తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment