ట్రబుల్..!
రియల్
చీమకుర్తి: కూటమి ప్రభుత్వం కొలువుదీరింది..రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలింది. చంద్రబాబు అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ ద్వారా లాభాలు గడించవచ్చనుకున్న టీడీపీ నాయకులకు అడియాశలే మిగిలాయి. నూతన ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే అమరావతిలో పెడితే కాయకు కాయ అంటూ ఒక వైపు టీడీపీ నాయకులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఊదరగొట్టారు. వీరి మాటలు నమ్మి చీమకుర్తి, సంతనూతలపాడు, ఒంగోలు పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి అమరావతి పరిసరాల్లో పొలాలు, ప్లాట్లు కొనుగోలు చేశారు. దీంతో జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. అనుకోకుండా విజయవాడలోని వరదలు ఒక్కసారిగా ముంచెత్తటంతో విజయవాడ, అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వారు తమ ప్లాట్లు ఎక్కడున్నాయో కూడా చివరకు డ్రోన్ కెమెరాల ద్వారా చూసుకున్నా కూడా కనిపించే పరిస్థితి లేదని ఆందోళన చెందారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చతికిలపడిందని గ్రహించే లోపే పెట్టిన పెట్టుబడుల్లో సగానికి సగం కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. అమరావతి ప్రభావం జిల్లాలోని రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రంగానే చూపింది. జిల్లాలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైన రిజిస్ట్రేషన్‌ల గణాంకాలు పరిశీలిస్తే ఎంతగా ప్రభావం చూపిందో తెలుస్తుంది. గత ఏడాది 2023 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 69,508 డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్‌లు జరిగి రూ.213.63 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోయిన నెల అక్టోబర్ వరకు రిజిస్ట్రేషన్‌లు 34,075 డాక్యుమెంట్లకు తగ్గింది. ఆదాయం కూడా రూ.181.51 కోట్లకు పడిపోయింది. అంటే దాదాపు 11 వేల డాక్యుమెంట్లు తగ్గటంతో రూ.32 కోట్ల ఆదాయం పడిపోయింది. జిల్లాలో ఒంగోలు, మార్కాపురం, కంభం, గిద్దలూరు, పొదిలి, యర్రగొండపాలెం, కనిగిరి, సంతనూతలపాడు, చీమకుర్తి, దర్శి, సింగరాయకొండ, అమ్మనబ్రోలు తదితర ప్రాంతాల్లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో రోజుకు 250 నుంచి 300 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. సగటున జిల్లా కేంద్రం ఒంగోలులో ఉన్న జాయింట్–1, జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో రోజుకు 50 నుంచి 60 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేస్తుంటారు. మార్కాపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సగటున రోజుకు 25, కంభంలో 15, గిద్దలూరులో 15, పొదిలిలో 15, యర్రగొండపాలెంలో 10, కనిగిరిలో 50 నుంచి 60, సంతనూతలపాడులో 15, చీమకుర్తిలో 15, దర్శిలో సుమారు 30 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు ప్లాట్లు, ఆరు రిజి స్ట్రేషన్లుగా సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాట్లు అడిగే వారు లేరని వాపోతున్నారు. ఈ వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఎప్పటికి వస్తాయోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
ముఖం చాటేస్తున్న మధ్యవర్తులు
ప్లాట్లు కొనేటప్పుడు మాత్రం ఈశాన్యం బిట్టు, తూర్పు వాస్తు, 30–40 అడుగుల వెడల్పు రోడ్లు, పక్కనే కల్యాణ మండపం, సినిమా థియేటర్‌లు కడతారంట అంటూ లేని పోని ఊహలు కల్పించి ప్లాట్లను మీడియేటర్లు కొనిపించారు. అంతటితో పోకుండా ఈ వెంచర్‌లో పేరున్న కంపెనీ వారు విల్లాలను కూడా నిర్మిస్తున్నారంటా అంటూ శంకుస్థాపనలు కూడా చేసినట్లు ఫ్లెక్లీలు, శంకుస్థాపనల గుంతలను తవ్వి ప్లాట్ల అమ్మకాలకు తెర తీశారు. తీరా ప్లాట్లను అమ్ముకొని పోయిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని తెలుసుకునే లోపు వారికి ప్లాట్లను అమ్మించిన మీడియేటర్లు కనిపించకుండా ముఖం చాటేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
బ్యాంక్‌లలో వేస్తే వడ్డీ తక్కువ, వడ్డీకి ఇస్తే వడ్డీ తర్వాత సంగతి అసలు కూడా రావడం లేదని పొలాలు, ప్లాట్లపై పెట్టుబడి పెడితే చివరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పడిపోవడంతో కొనుగోలు చేసిన ప్లాట్లు అమ్ముడు పోతాయో లేదోనని మనసంతా హద్దురాళ్ల చుట్టే ప్రదక్షిణలు చేస్తుందని జనం వాపోతున్నారు. పేరుకు ఇంట్లో ఉన్నారనే గానీ రోజుకు ఒకటి రెండు సార్లు ప్లాట్ల వైపు తొంగిచూసి ఏమైనా అడిగే వారున్నారా...? అంటూ పెట్టిన పెట్టుబడికి వడ్డీ కాదుగదా... అసలులో సగమైనా వస్తుందా..? అని పెట్టుబడి పెట్టిన వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక కుప్పకూలిన రియల్ ఎస్టేట్ వ్యాపారం గత ఏడాది 69,508 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌తో రూ.213 కోట్ల ఆదాయం ఈ ఏడాది 34,075 డాక్యుమెంట్లకు పరిమితమై రూ.181 కోట్లకు తగ్గుదల దాదాపు రూ.32 కోట్లు తగ్గిన ఆదాయం అమరావతిలో స్థలాలు కొనిపించిన టీడీపీ నేతలు కృష్ణా వరదల ప్రభావంతో పడిపోయిన వ్యాపారం ఆందోళనలో కొనుగోలుదారులు
స్థిరాస్తి రంగంలో స్తబ్ధత నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా వ్యాప్తంగా ఆస్తుల క్రయ, విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.
దీంతో రిజిస్ట్రేషన్లు
మందగించాయి.
గత సంవత్సరం ఏప్రిల్
నుంచి అక్టోబర్ మధ్య
జరిగిన వాటితో పోల్చుకుంటే
డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు
భారీగా తగ్గాయి. ఫలితంగా
రూ.32 కోట్ల మేర ఆదాయం
పడిపోయింది.
ఈ ఏడాది రూ.181 కోట్ల ఆదాయం వచ్చింది
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.181.51 కోట్ల ఆదాయం వచ్చింది. రిజిస్ట్రేషన్‌లు 34,075 డాక్యుమెంట్లు జరిగాయి. అదే గత ఏడాది 69,508 డాక్యుమెంట్ల ద్వారా రూ.213.63 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు 11 వేల డాక్యుమెంట్ల రిజి స్ట్రేషన్ తగ్గి రూ.32 కోట్ల ఆదాయం పడిపోయింది.
– బాలాంజనేయులు, జిల్లా రిజిస్ట్రార్, ఒంగోలు
Comments
Please login to add a commentAdd a comment