No Headline
మేసీ్త్ర వ్యవస్థ ఉండదు...
నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగంలో ఇక నుంచి మేసీ్త్ర వ్యవస్థ ఉండదు. వాళ్లు వర్కర్‌లుగానే చేరారు. వర్కర్‌గానే పనిచేయాలి. పనిచేయకుండా, కొందరు మస్టర్ కూడా వేసుకోకుండానే జీతాలు తీసుకుంటున్నారు. అందుకోసమే ప్రక్షాళన చేస్తున్నాను. ఇందులో రాజకీయ పార్టీ నాయకుల ప్రమేయం ఏమీ లేదు. పోస్టులు అమ్ముకుంటున్నారని అనుకోవటం వాస్తవం కాదు. అందరి చేత పనిచేయించి నగర అభివృద్ధికి పాటుపడాలన్నదే లక్ష్యంగా ముందుకు పోతున్నా.
– కే.వెంకటేశ్వర రావు, ఒంగోలు నగర కమిషనర్
నాయకులు అమ్ముకోవటానికే....
అధికార పార్టీ నాయకులు మేసీ్త్ర పోస్టులను అమ్ముకోవటానికి నగర కమిషనర్ మేసీ్త్రలను పక్కన పెట్టారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఈ ఉద్యోగాలను అమ్ముకోవటానికి వాటాలు వేసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలు, వాళ్ల పేరుతో ఇతరులకు ఈ ఉద్యోగాలను అమ్ముకునేందుకు ఇప్పటికే బేరాలు పెట్టారు. 20 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న వారిని ఉద్యోగం నుంచి తీసేయటం అత్యంత దుర్మార్గం. దీనిని సీఐటీయూ యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.
– టీ.మహేష్,
సీఐటీయూ ఒంగోలు నగర కార్యదర్శి
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా..
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఒంగోలు నగరంలోని పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులను తొలగించారు. కనీసం ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా తీసేయటం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం మేసీ్త్ర వ్యవస్థను తీసేయాలని కనీసం సర్క్యులర్ కూడా జారీ చేయలేదు. ఒంగోలు నగర కమిషనర్ వెంకటేశ్వరరావు అధికార పార్టీ నాయకులతో కుమ్మకై ్క వాళ్ళు ఏది చెబితే అది చేస్తున్నారు. కార్మికుల్లో చిచ్చు పెట్టి కొందరిని తిరిగి మేసీ్త్రలుగా కొనసాగిస్తానని వాళ్లకు మాయమాటలు చెప్పి ధర్నాకు రాకుండా చేస్తున్నాడు కమిషనర్. కార్మికులను విభజించి పాలిస్తున్నాడు.
– కొర్నిపాటి శ్రీనివాసరావు,
సీఐటీయూ జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment