సొంత వైద్యం ఆరోగ్యానికి చేటు
ఒంగోలు టౌన్: సొంత వైద్యం ఆరోగ్యానికి చేటు చేస్తుందని, ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని క్విస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి చెందిన ఫార్మా డీ విభాగం హెచ్‌ఓడీ డా.చంద్రకళ చెప్పారు. నేషనల్ ఫార్మసీ వీక్ సెలబ్రేషన్స్‌ను పురస్కరించుకొని మంగళవారం జీజీహెచ్‌లో ఫార్మా డీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. థింక్ హెల్త్, థింక్ ఫార్మసీ నినాదంతో ర్యాలీ నిర్వహించిన ర్యాలీలో జీజీహెచ్‌లోని రోగులకు ఔషధాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు వైద్యుడిని సంప్రదించిన తరువాత వారు సూచించిన మందులు మాత్రమే వాడాలని చంద్రకళ చెప్పారు. వైద్యులు రోగి వయసు, బరువుకు తగిన డోసును నిర్ధారించిన మందులు సూచిస్తారని, వారు చెప్పిన సమయం ప్రకారం వాటిని వాడడం సురక్షితమని తెలిపారు. మందులు వాడే సమయంలో తీసుకోవాల్సిన ఆహారం గురించి వివరించారు. ఈ ర్యాలీలో ఫార్మసీ విజిలెన్స్ హెడ్ డా.ఝాన్సీ, ప్రిన్సిపాల్ ఎం.కిశోర్ బాబు, ఫార్మసీ విభాగం హెచ్‌ఓడీ డా.జాలిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment