జిల్లాలో 33 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
త్రిపురాంతకం: జిల్లాలో 33 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు సివిల్ సప్‌లై డీఎం జీ వరలక్ష్మి తెలిపారు. త్రిపురాంతకం మండలం విశ్వనాథపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఆమె మాట్లాడుతూ జిల్లాలో 13 రైస్‌మిల్లుల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తారన్నారు. ఇప్పటి వరకు 1100 టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తారన్నారు. 150 మంది రైతులకు రూ.1.50 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. 50 శాతం రైతులకు చెల్లింపులు జరిగాయని, సకాలంలో చెల్లిస్తారన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలు పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులకు సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వరలక్ష్మి తెలిపారు.
జిల్లా వైద్యాధికారిగా వెంకటేశ్వర్లు
ఒంగోలు టౌన్: జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా తెలగతోటి వెంకటేశ్వర్లును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన బాపట్ల జిల్లా డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ గా చేస్తున్నారు. గతంలో ఆయన ప్రకాశం జిల్లాలో ప్రాజెక్ట్ ఆఫీసర్ డిస్టిక్ట్ ట్రైనింగ్ టీమ్ (పీఓడీటీ)గా విధులు నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షునిగా కూడా చేశారు. అద్దంకికి చెందిన ఆయనకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం. ఈ క్రమంలోనే మంత్రి రవి ఆయనకు మాట ఇచ్చిఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమధ్య పూర్వ డీఎంహెచ్‌ఓ రత్నావళికి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఆమెకు రికమెండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఆమెకు ఆర్డర్ వేసిన కొద్ది సేపటికే రద్దు చేయడం చర్చనీయాంశం అయింది. మంత్రి రవి అభ్యంతరం చెప్పడం వల్లనే ఆమెకు ఇచ్చిన పోస్టింగ్ నిలిపేసినట్లు వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగులు గుసగుసలాడారు. అప్పుడే వెంకటేశ్వరరావు వస్తారని ప్రచారం జరిగింది. అందరూ అనుకున్నట్లే ఇప్పుడు వెంకటేశ్వర్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment