వర్ధిల్లు నూరేళ్లు..
ప్రగతి ప్రదాతా..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తమ ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను శనివారం ప్రజలు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పండుగలా నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేలాది మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు కేక్ కట్ చేసి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వేలాది మంది నిరుపేదలకు చీరలు పంపిణీ చేశారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల బ్రహ్మానందరెడ్డి జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ లు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు రక్తదానం చేశారు.
అనంతరం ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ జగనన్న పుట్టిన రోజు వేడుకలను తెలుగు వారంతా ఘనంగా నిర్వహించారన్నారు. ప్రజల కోసం ప్రజల నుంచి పుట్టినవాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. ప్రజా నాయకుడి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోందన్నారు. జనం పక్షాన నిలిచి వారి సమస్యల కోసం పోరాడుతోందని చెప్పారు. ఒంగోలు పార్లమెంట్ నుంచి జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారన్నారు. ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో మళ్లీ సీఎం గా వైఎస్ జగన్ రావాలని కోరుకుంటున్నారన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ జననేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమానికి కృషి చేసిన నాయకుడు జగన్ అని కొనియాడారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ సంక్షేమ సారథి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ జగన్ నిరంతరం కృషి చేశారని కొనియాడారు. ఒంగోలు నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరు కలిసికట్టు గా సమైక్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు నందకిషోర్, టాస్క్‌ఫోర్సు జిల్లా ఇన్‌చార్జ్ కె.వి.రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్‌సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్, తదితరులు జగనన్న కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
వాడవాడలా వేడుకలు
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించారు.
● దర్శిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జగనన్న పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. 100 మంది వైఎస్సార్‌సీపీ అభిమానులు రక్తదానం చేశారు. అంతకుముందు గడియారం స్తంభం సెంటర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
● టంగుటూరులో నిర్వహించిన జగనన్న పుట్టిన రోజు వేడుకల్లో మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సింగరాయకొండలోని కందుకూరు రోడ్డు సెంటర్‌లో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు.
● మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల్లో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు పాల్గొని కేక్ కట్ చేశారు. పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. పొదిలి పట్టణంలో కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి నివాసంలో కేక్ కట్ చేశారు. మార్కాపురం పట్టణంలో పాతబస్టాండ్ లోని వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. తూర్పువీధిలో అన్నదానం చేశారు. మార్కాపురం పట్టణంలోని జంకె వెంకటరెడ్డి నివాసంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇందులో అన్నా రాంబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షంషేర్ అలీబేగ్, మున్సిపల్ చైర్మన్ బాల మురళీకృష్ణ, పట్టణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.
● యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగనన్న పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. పార్టీ కార్యాలయం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్, నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సెంట్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలకు చీరలు, ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేశారు.
● కనిగిరిలో జగనన్న జన్మదిన వేడుకలను కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 4 వేల మందికి చీరలు పంపిణీ చేశారు. 200 మంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. భారీ కేక్ కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
● సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తిలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి జగనన్న పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. మద్దిపాడు, సంతనూతలపాడు మండలాల్లో మాజీ మంత్రి మేరుగు నాగార్జున పాల్గొన్నారు.
జిల్లాలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన నాయకులు రక్తదానం, అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చెవిరెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది మహిళలకు చీరల పంపిణీ కేక్‌లు కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు, కార్యకర్తలు హ్యాపీబర్త్‌డే జగనన్న అంటూ నినాదాలు నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం
Comments
Please login to add a commentAdd a comment