రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
దర్శి: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలైన సంఘటన దర్శిలోని పొదిలి రోడ్డులో శనివారం జరిగింది. దర్శి పట్టణంలోని ఓ హోటల్లో పనిచేసే చల్లా శివప్రసాద్ (28) స్కూటీపై వెళ్తూ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బ్యూటీషియన్ కోర్సులో
ఉచిత శిక్షణకు దరఖాస్తులు
సంతనూతలపాడు:
బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణకు ఆసక్తి గల మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జె.రవితేజ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, మహిళా ప్రాంగణం సంయుక్త ఆధ్యర్యంలో ఈ నెల 23వ తేదీ నుంచి సంతనూతలపాడులోని ఎండ్లూరు డొంక వద్ద గల మహిళా ప్రాంగణంలో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. 15 నుంచి 45 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ షేక్ బాషా (99630 05209)ను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment