రైలు కిందపడి వ్యక్తి మృతి
కంభం: రైలు కిందపడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన కంభం రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 60 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని కంభం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తించారు. అతని జేబులో ఒక హాస్పిటల్ రసీదు ఉంది. అందులో ఉన్న వివరాల ప్రకారం అతని పేరు జి.ప్రకాష్ అని తెలిసింది. అతనికి సంబంధించిన ఇతర వివరాలు తెలియరాలేదు. మృతుడు చామనచాయ రంగు కలిగి తెల్లని చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. మృతుని వివరాలు తెలిసిన వారు నంద్యాల రైల్వే ఎస్సై (9440627653, 7702650514)కి సమాచారం ఇవ్వాలని రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment