పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత
● ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు టౌన్: పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ కార్యాలయం ఆవరణలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పోలీసులు ఆరోగ్య రక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మంచి ఆహారంతో పాటు పరిశుభ్రమైన మంచినీరు తాగడం చాలా అవసరమన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సొంత నిధులతో ఈ ప్లాంట్‌ను పునరుద్ధరించినట్లు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే జనార్దన్‌కు ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛమైన నీటిని సిబ్బందికి అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ , అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, తాలూకా సీఐ అజయ్ కుమార్, ఆర్‌ఐలు సీతారామిరెడ్డి, రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment