రోడ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు వన్‌టౌన్: పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూర్తయిన పనులకు సంబంధించి బిల్లులను అప్‌లోడ్ చేయాలన్నారు. పనులకు బిల్లులు వెంటనే చెల్లిస్తారన్నారు. ఒంగోలు, సంతనూతలపాడు, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, నియోజకవర్గాల్లో ఈ రోడ్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు శ్రద్ధగా చేయాలన్నారు. ఈ పనులు చేపట్టడంలో ఎక్కడైనా రెవెన్యూ పరంగా సమస్యలు తలెత్తితే అక్కడి తహశీల్దార్లతో సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ జోసఫ్ కుమార్, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ జీ బ్రహ్మయ్య, ఈఈలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment