గోమాతకు సీమంతం.. ఊరంతా సంబరం
కొండపి: ఇంటి ఆడపడుచుకే కాదు.. పవిత్రంగా చూసుకునే గోమాతకూ సీమంతం వేడుకగా చేశారా గ్రామస్తులు. కొండపి మండలం కే ఉప్పలపాడు శివాలయానికి ఓ వ్యక్తి గోవును దానంగా ఇచ్చాడు. దాని బాధ్యతను గ్రామంలోని మహిళలు చూసుకుంటున్నారు. ఈక్రమంలో ఆవు చూడికి రావడంతో తమ ఇంటి బిడ్డలా చూసుకుంటున్న దానికి సీమంతం చేయాలని తలచారు. గ్రామంలోని మహిళలు తలాకొంత డబ్బులు సమకూర్చుకుని శుక్రవారం రాత్రి సీమంతం వేడుక నిర్వహించారు. గ్రామంలోని మహిళలంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. గోవుల రక్షణతో పాటు పశుసంపద, ప్రజలంతా బాగుండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ అర్చకుడు రాఘవేంద్ర శర్మ తెలిపారు. వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పసుపు, కుంకుమ, మిఠాయిలు పంచిపెట్టామన్నారు. సీమంతం నిర్వహించిన ఆవుకు శనివారం దూడ పుట్టడంతో మహిళలు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment