వ్యాధి లక్షణాలు ఇలా..
హెచ్‌ఎంపీవీ వైరస్ లక్షణాలు దాదాపుగా కరోనా లక్షణాలను పోలి ఉంటుంది. దీనిని కూడా శ్వాస కోశ సంబంధిత వ్యాధిగానే నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, తుమ్ములు, గొంతులో మంట, జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లికూతలతో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. న్యూమోనియా, ఆస్తమా లాంటి శ్వాస కోశ సమస్యలను పోలి ఉంటుంది. అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని క్వాలిఫైడ్ వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ ఎక్కువగా వృద్ధులు, చిన్నారుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం బెంగళూరు, అహ్మదాబాద్‌లో వెలుగుచూసిన మూడు కేసులూ సంవత్సరంలోపు చిన్నారులవే. ఈ వైరస్ 0 నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నారుల్లోనూ, 55 నుంచి 60 సంవత్సరాలు దాటిన వృద్ధుల్లో, షుగర్, కేన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారిలోనూ ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని వైద్యులు తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు ముందస్తు జాగ్రతలు తీసుకుంటే చాలని వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టలేదు, కానీ ఈ హెచ్‌ఎంపీవీ వైరస్ మాత్రం చిన్నపిల్లలపై ఎక్కువ ప్రభావం చూపించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment