7, 8న మిడ్‌లైన్ పరీక్ష నిర్వహించాలి
ఒంగోలు సిటీ: జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, మెర్జ్ అయిన ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు తరల్ మిడ్‌లైన్ పరీక్షను ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించాలని డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, గణితం సబ్జెక్టుల్లో మిడ్‌లైన్ పరీక్ష నిర్వహించాలని, పరీక్షా ఫలితాలను ఈ నెల 10వ తేదీలోపు ఆన్‌లైన్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. మండల విద్యాశాఖాధికారులు వారి పరిధిలోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో (ప్రైవేటు మినహాయించి) పరీక్ష నిర్వహించే విధంగా ప్రధానోపాధ్యాయులు తగు ఆదేశాలు జారీ చేయాలన్నారు.
8న ఒంగోలులో జాబ్ మేళా
ఒంగోలు వన్‌టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సిడాప్ సంయుక్తంగా ఈ నెల 8వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి జే రవితేజ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలులోని ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో నిర్వహించే ఈ జాబ్‌మేళాలో అక్విటాస్ ఈస్టోన్ ప్రవేట్ లిమిటెడ్, ముత్తూట్ ఫిన్‌కార్ప్, సెలక్ట్ గ్యాడ్జట్స్, కీర్తి మెడికల్స్ తదితర కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేస్తాయన్నారు. అభ్యర్థులు జిల్లాకు చెందిన వారై ఉండాలని, వయస్సు 19 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ అర్హతను బట్టి జీతం ఉంటుందన్నారు. ఇతర పూర్తి వివరాలకు స్కిల్ హబ్ కోఆర్డినేటర్ సెల్:7989244381 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
14న జిల్లా స్థాయి డ్యాన్స్ పోటీలు
ఒంగోలు సిటీ: అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 74వ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు జిల్లా స్థాయి డ్యాన్స్ పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డ్యాన్స్ పోటీలకు సంబంధించి అభ్యుదయ గేయాలకు మొదటి బహుమతి రూ.3,116, రెండో బహుమతి రూ.2,516, మూడో బహుమతి రూ.1516, ఇతర పాటలకు మొదటి బహుమతి రూ.816, రెండో బహుమతి రూ.516 అందజేస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 7095863125, 9703610685 నంబర్లను సంప్రదించాలని కోరారు.
జాతీయ స్థాయి ఫెన్సింగ్ క్యాడిట్ పోటీలకు అంబరీష్ ఎంపిక
ఒంగోలు: జాతీయ స్థాయి ఫెన్సింగ్ క్యాడిట్ అండర్ 17 పోటీలకు పుత్తూరి అంబరీష్ ఎంపికై నట్లు జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ముఖ్య కార్యదర్శి జి.నవీన్ తెలిపారు. ఇటీవల కాకినాడలో జరిగిన 10వ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ క్యాడిట్ విభాగంలో అంబరీష్ బ్రాంజ్‌మెడల్ సాధించాడు. ఈనెల 8 నుంచి 11వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రాపూర్ పట్టణంలో జరిగే 19వ జాతీయ స్థాయి ఫెన్సింగ్ క్యాడిట్ అండర్ 17 విభాగంలో అంబరీష్ సత్తాచాటనున్నాడు. స్వగ్రామం చీమకుర్తి కాగా ప్రస్తుతం ఒంగోలులో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ సందర్భంగా అంబరీష్‌ను ఫెన్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, కోచ్‌లు జి.భరత్, ఆర్,విజయలక్ష్మి, డి.రాజు ప్రత్యేకంగా అభినందించారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీలో సత్తాచాటిన జ్యోత్స్నప్రియ
పెద్దారవీడు: గత నెలలో 50వ అంతర జిల్లాల రాష్ట్ర స్థాయి ప్రావిన్స్ కబడ్డీ పోటీలో దేవండ్ల జ్యోత్స్నప్రియ పాల్గొని ఉత్తమ ప్రతిభ చాటిందని ప్రధానోపాధ్యాయుడు షేక్ అహ్మద్ సోమవారం తెలిపారు. మండలంలో ఏనుగులదిన్నెపాడు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని జ్యోత్స్నప్రియ ప్రకాశం జిల్లా కబడ్డీ జట్టు తరఫున తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రావిన్స్ కబడ్డీ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రదర్శన కనబరిచిందని తెలిపారు. గత నెలలో బాపట్ల జిల్లా పిట్లవారిపాలెంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలో కూడా ఉత్తమ ప్రదర్శనతో రాష్ట్రస్థాయి ప్రావిన్స్ జట్టుకు ఎంపికై ందని చెప్పారు. విద్యార్థినికి కబడ్డీలో ఉత్తమ శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు దేవండ్ల చంద్రయ్య, పీఈటీ సురేష్‌లను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment