సంతనూతలపాడు: జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10 తేదీ సంతనూతలపాడు మండలంలోని మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్‌ల్స్ హాకీ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు ఏవీ.రమణారెడ్డి, కార్యదర్శి ఏ.సుందరరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హాకీ పట్ల ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం తీసుకొని పదో తేదీ ఉదయం 9 గంటలకు రావాలన్నారు. ఎంపికై న సబ్ జూనియర్ బాయ్స్ జట్టు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు మదనపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపికై న గర్‌ల్స్ జట్టు ఈనెల 27 నుంచి 29 వరకు అనంతపురం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఈ ఎంపికలకు వచ్చేవారు 11–2009 తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. పూర్తి వివరాలకు పీఈటీ తిరుమలశెట్టి రవికుమార్ 9666067764 ను సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment