స్వీయ అభ్యసనకు పాల్‌ల్యాబ్స్ ఉపయుక్తం
● డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్
ఒంగోలు సిటీ: విద్యార్థులను స్వీయ అభ్యసన దిశగా తీసుకెళ్లేందుకు పాల్‌ల్యాబ్స్ ఉపయోగపడతాయని డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ అన్నారు. సోమవారం ప్రకాశం, బాపట్ల జిల్లాలోని 32 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు చెందిన ప్రిన్సిపాల్స్, బోధనా సిబ్బంది 128 మందికి స్థానిక రామ్‌నగర్‌లోని మున్సిపల్ హైస్కూల్‌లో పాల్‌ల్యాబ్స్ కు సంబంధించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ శిక్షణ జరుగుతున్న తీరు పరిశీలించి, పాల్‌ల్యాబ్స్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులు పాల్‌ల్యాబ్స్ వినియోగించేటట్లు టైంటేబుల్ ఏర్పాటు చేసి వారంలో ఒక రోజు ఇంటర్‌నెట్ కనెక్టు చేసి రిపోర్టు జనరేట్ అయ్యేట్లు చూడాలని సిబ్బందికి తెలిపారు. పాల్‌ల్యాబ్స్ వినియోగంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉంచాలని సూచించారు. ప్రతి పాఠశాలకు 30 చొప్పున 840 ట్యాబులును పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వరరావు, ఒంగోలు ఎంఈఓ టి.కిషోర్‌బాబు కోర్సు డైరెక్టరుగా వ్యవహరించారు. శిక్షణా కార్యక్రమం పరిశీలనకు స్టేట్ అబ్జర్వర్ డి.మాధవీలత, సమగ్రశిక్ష సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment