పశువైద్యాధికారి స్వామి భక్తి
● టీడీపీ కార్యాలయంలో పశువైద్య శిబిరాల
పోస్టర్ ఆవిష్కరణ
పామూరు: మండల పశు వైద్యాధికారి ఈమని శ్రీసాయి స్వామి భక్తిని ప్రదర్శించారు. సోమవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న పశు ఆరోగ్య శిబిరాల వాల్‌పోస్టర్‌ను పామూరు మండల టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. పోస్టర్‌ను వైద్యశాలలో లేదా గ్రామాల్లో ఆవిష్కరించాల్సి ఉండగా సోమవారం వెటర్నరీ అసిస్టెంట్ ఖాదర్‌బాషాతో కలిసి టీడీపీ కార్యాలయానికి చేరుకున్న డాక్టర్ శ్రీసాయి మండల టీడీపీ నాయకుల కోసం వేచి ఉండి మరీ పోస్టర్‌ను ఆవిష్కరించడం గమనార్హం. డాక్టర్ శ్రీసాయి వైద్యశాలలో అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. పార్టీలకు అతీతంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఉద్యోగి ఇలా పార్టీ కార్యాలయంకు వెళ్లి స్వామి భక్తి చాటుకోవడంపై పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై జిల్లా అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment