వెటరన్ టెన్నిస్‌లో గిద్దలూరు వాసుల సత్తా
గిద్దలూరు రూరల్: నరసరావుపేటలో ఈ నెల 18, 19వ తేదీల్లో నిర్వహించిన వెటరన్ టెన్నిస్ టోర్నమెంట్(65 ఏళ్లు పైబడిన విభాగం) డబుల్స్‌లో గిద్దలూరుకు చెందిన కంచర్ల కోటయ్యగౌడ్, శశిభూషణ్‌రెడ్డి విజేతలుగా నిలిచారు. గుంటూరుకు చెందిన టీవీ రావు, తిరుపతిరెడ్డిపై విజయం సాధించి ట్రోఫీని కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారిని ప్రకాశం జిల్లా లాన్ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ మోహన్‌రెడ్డితోపాటు గిద్దలూరు టెన్నిస్ కోర్టు అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ రంగారెడ్డి, రీక్రియేషన్ క్లబ్ కోశాధికారి త్రిమూర్తిరెడ్డి తదితరులు అభినందించారు.
ఎస్పీని కలిసిన విజిలెన్స్ ఏఎస్పీ, కనిగిరి డీఎస్పీ
ఒంగోలు టౌన్: సాధారణ బదీలీల్లో భాగంగా కనిగిరి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పి.సాయి ఈశ్వర్ యశ్వంత్ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఎస్పీ కె. శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎస్పీని కలిశారు.
ఉపాధిహామీ పనులు
వేగవంతం చేయాలి
ఒంగోలు అర్బన్: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు సజావుగా నిర్వహించాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కందకం తవ్వకాలు, నీటి వనరుల్లో పూడిక తీత పనులు, అమృత్ సరోవర్ పథకం కింద చెరువుల అభివృద్ధి, గోకులం షెడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఆయా పనులను రోజూ పర్యవేక్షింలని ఏపీఓలను ఆదేశించారు. కేవలం మూడో శనివారం మాత్రమే కాకుండా పారిశుధ్య పనులు రోజు విధిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. మీ కోసం అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీపీఓ వెంకటనాయుడు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, హౌసింగ్ పీడీ శ్రీనివాసప్రసాద్, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్, సీపీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment