ఆలయ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
పామూరు: దేవస్థాన భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్(ఆర్‌జేసీ) ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ హెచ్చరించారు. మండల కేంద్రమైన పామూరు–నెల్లూరు రోడ్డులో ఆక్రమణకు గురైన శ్రీవల్లీ భుజంగేశ్వర, మదన వేణుగోపాలస్వామి ఆలయ భూములు, వాటిలో నిర్మించిన ఇళ్లు, చర్చిలను క్షేత్రస్థాయిలో ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబుతో కలిసి పరిశీలించారు. ఆక్రమణదారులకు నోటీసులిచ్చి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని ఈఓను ఆదేశించారు. ఆలయ భూముల్లో చర్చి నిర్మించారని బీజేపీ నాయకులు కొండిశెట్టి రమణయ్య ఆర్‌జేసీ దృష్టికి తీసుకురాగా తక్షణమే తొలగించాలని ఈఓకు సూచించారు. అనుమలశెట్టి సత్రం, వీరబ్రహ్మంద్రస్వామి ఆలయ ఆస్తులపై నివేదిక ఇవ్వాలని ఏఈ నరసింహబాబుకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ గుర్రం వెంకటేశ్వర్లు, ఎస్.నరసింహులు, పశుపులేటి రఘురాం, బండ్లా నారాయణ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలి
సీఎస్‌పురం(పామూరు): మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్‌జేసీ ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. సోమవారం నారాయణస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. గతంలో నిర్వహించిన వేలం బకాయిలు వసూలు చేసి ఆలయ ఖాతాలో జమ చేయాలని ఈఓ నరసింహబాబుకు సూచించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ కొమ్మినేని చిన్న ఆదినారాయణ, కొమ్మినేని వెంకట్రావు, సిబ్బంది పాల్గొన్నారు.
పామూరులో ఆక్రమిత భూములను
పరిశీలించిన ఆర్‌జేసీ
Comments
Please login to add a commentAdd a comment