![సీఎల్‌ఆర్‌సీ స్థల ఆక్రమణపై విచారణ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06gdlr60-260038_mr-1738869933-0.jpg.webp?itok=62DplyrB)
సీఎల్‌ఆర్‌సీ స్థల ఆక్రమణపై విచారణ
బేస్తవారిపేట: బేస్తవారిపేట దరగ రోడ్డులోని సీఎల్‌ఆర్‌సీ భవనానికి సంబంధిత స్థలాన్ని అటెండర్ ఆక్రమించాడనే ఫిర్యాదుతో జిల్లా నీటి యాజమాన్య సంస్థ విజిలెన్స్ అధికారిణి ఝాన్సీరాణి గురువారం విచారణ నిర్వహించారు. అర్థవీడు మండలం కాకర్లకు చెందిన పెరికె రాంబాబు పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్‌కు సీఎల్‌ఆర్‌సీ స్థలం ఆక్రమణ, అటెండర్‌పై ఫిర్యాదు చేశాడు. డ్వామా పీడీ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారిణి విచారణ చేపట్టారు. సీఎల్‌ఆర్‌సీ భవనానికి 2009లో 50 సెంట్ల స్థలం కేటాయించారని, ఖాళీ స్థలంలో అటెండర్ రంగస్వామి ఆక్రమణ చేసి బిల్డింగ్ కట్టుకుంటున్నాడని, అటెండర్ కార్యాలయంలో ఉండకుండా సెల్‌షాపు నిర్వహించుకుంటున్నట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. రెవెన్యూ సర్వేయర్‌తో సర్వే చేయించి ఆక్రమణ జరిగిందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని, విచారణ నివేదికను డ్వామా పీడీకి అందజేస్తున్నట్లు చెప్పారు. విచారణలో డ్వామా పీడీకి ఏపీడీ భాస్కరరావు, సీఎల్‌ఆర్‌సీ కోర్సు డైరెక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment