![మెరుగైన సేవలు అందించటమే లక్ష్యం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06ong603-260048_mr-1738869933-0.jpg.webp?itok=0CyTcLgA)
మెరుగైన సేవలు అందించటమే లక్ష్యం
ఒంగోలు సిటీ: ప్రజల మన్ననలు పొందుతూ మెరుగైన సేవలు అందించటమే లక్ష్యమని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అన్నారు. గురువారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళా ఫిర్యాదుదారుల పట్ల పాటించాల్సిన ప్రవర్తన, ఫిర్యాదుల స్వీకరణ, సత్వర పరిష్కారం వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ (మహిళా సహాయక కేంద్రం) బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ప్రతి స్టేషన్‌లో రిసెప్షన్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్/హెడ్ కానిస్టేబుల్ ఉండాలన్నారు. పోలీస్‌స్టేషన్ కు వచ్చిన మహిళా ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ వారిని కూర్చోబెట్టి, మంచినీరు వంటి తగిన సదుపాయాలు కల్పించి వారి సమస్యలను సావధానంగా తెలుసుకోవాలని, వారి ఫిర్యాదులను రిసెప్షన్ రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలన్నారు. ఫిర్యాదులపై వారికి రసీదు అందజేయాలన్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే అధికారులకు తెలియజేయాలని, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, పిల్లలపై వచ్చే ఫిర్యాదులపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఫిర్యాదులకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రస్తుత స్టేటస్ తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, నూతన చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. పలు కేసులో బాధితులకు పరిహారాలు అదేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, టీటీసీ సీఐ షమీముల్లా, కమ్యూనికేషన్స్ సీఐ వెంకయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్ ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారంపై పోలీస్ సిబ్బందికి దిశా నిర్దేశం
Comments
Please login to add a commentAdd a comment