పాఠశాలల పునఃనిర్మాణ ప్రక్రియ సజావుగా చేయాలి | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల పునఃనిర్మాణ ప్రక్రియ సజావుగా చేయాలి

Published Fri, Feb 7 2025 1:07 AM | Last Updated on Fri, Feb 7 2025 1:07 AM

పాఠశా

పాఠశాలల పునఃనిర్మాణ ప్రక్రియ సజావుగా చేయాలి

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

ఒంగోలు అర్బన్‌: జిల్లాలో పాఠశాలల పునఃనిర్మాణ ప్రక్రియ సజావుగా చేయాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా విద్యా శాఖ అధికారులకు సూచించారు. పాఠశాలల పునఃనిర్మాణ ప్రక్రియకు సంబంధించి నియోజకవర్గాల వారీగా మండల విద్యా శాఖ అధికారులతో గురువారం ప్రకాశం భవనంలో సమీక్షించారు. వారు తయారు చేసిన పీపీటీలను పరిశీలించి తగు మార్పులను తెలిపారు. అనంతరం జిల్లాలో 38 పాఠశాల పునః నిర్మాణ ప్రక్రియకు ఆమోదం తెలిపారు. దీనిలో డీఈఓ కిరణ్‌కుమార్‌, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఉప విద్యా శాఖ అధికారులు, డీసీఈబీ సెక్రటరీలు, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

రైస్‌మిల్లు తనిఖీ చేసిన జాయింట్‌ కలెక్టర్‌

పొదిలి: స్థానిక ఒంగోలు రోడ్డులోని లక్ష్మీ శ్రీనివాస రైస్‌మిల్లును జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలక్రిష్ణ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిల్వలను, రికార్డులను పరిశీలించారు. యజమానులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. అనంతరం కాటూరివారిపాలెంలో రేషన్‌ దుకాణం 34ను కూడా తనిఖీ చేశారు. స్టాకు, రికార్డులను పరిశీలించారు. వీరి వెంట తహసీల్దార్‌ ఎంవీ.కృష్ణారెడ్డి, ఆర్‌ఐ, వీఆర్‌ఓలు ఉన్నారు.

సదరమ్‌ క్యాంపును పరిశీలించిన డీఎంహెచ్‌ఓ

ఒంగోలు అర్బన్‌: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్‌)లో జరుగుతున్న సదరమ్‌ క్యాంపును డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, డీసీహెచ్‌ఎస్‌ సూరిబాబులు గురువారం పరిశీలించారు. క్యాంపులో సైక్రియాట్రి, ఎముకలు, కీళ్ల విభాగాల్లో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. వైద్య పరీక్షలకు వచ్చిన వారికి త్వరగా వైద్య పరీక్షలు చేసి వారి స్వగ్రామాలకు వెళ్లేలా చూడాలన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించకుండా మానవత్వంతో మసులుకోవాలని సిబ్బందికి సూచించారు. దీనిలో ఆర్‌ఎంఓ వేణుగోపాల్‌రెడ్డి, ఇతర అధికారులు మాధవీలత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ హాస్టళ్లకు క్రీడా సామగ్రి సరఫరా

ఒంగోలు వన్‌టౌన్‌: జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు క్రీడా సామగ్రిని రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డైరక్టర్‌ ఎన్‌ లక్ష్మా నాయక్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 7 సహాయ సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయాల పరిధిలో 75 వసతి గృహాలకు ఈ క్రీడా సామగ్రిని సరఫరా చేశారు. ఇక్కడ నుంచి వసతి గృహాలకు క్రీడా సామగ్రిని పంపిణీ చేస్తున్నారు. టెన్నికాయిట్‌, చెస్‌బోర్డ్స్‌, కారమ్‌ బోర్డ్స్‌, షటిల్‌ కాక్‌, షటిల్‌ బ్యాట్‌, షటిల్‌ నెట్‌, స్కిప్పింగ్‌ రోప్‌, వాలీబాల్‌, వాలీబాల్‌ నెట్‌, డిస్కస్‌ త్రో, పీవీసీ విత్‌ రింగ్‌, జావెలిన్‌ త్రో, షాట్‌పుట్‌లను పంపిణీ చేశారు.

నేటి నుంచి జర్ధోసి మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ

ఒంగోలు వన్‌టౌన్‌: జర్ధోసి మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఒంగోలు రూడ్‌సెట్‌ సంస్థ డైరక్టర్‌ పీ శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి 30 రోజుల పాటూ ఈ శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన అభ్యర్థులు అర్హులన్నా రు. అభ్యర్థులు తమ ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డుతో శిక్షణకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత, భోజన వసతి సౌకర్యం కల్పిస్తా రన్నారు. ఇతర పూర్తి వివరాలకు 8309915577 అనే నంబరులో సంప్రదించాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పాఠశాలల పునఃనిర్మాణ ప్రక్రియ సజావుగా చేయాలి 1
1/2

పాఠశాలల పునఃనిర్మాణ ప్రక్రియ సజావుగా చేయాలి

పాఠశాలల పునఃనిర్మాణ ప్రక్రియ సజావుగా చేయాలి 2
2/2

పాఠశాలల పునఃనిర్మాణ ప్రక్రియ సజావుగా చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement