ధాన్యం తరుగు తీయొద్దు
ఇల్లంతకుంట(మానకొండూరు): ధాన్యం తూకంలో తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం నిర్వహించిన ఇల్లంతకుంట పీఏసీఎస్ మహాజనసభ సమావేశానికి హాజరై మాట్లాడారు. రైతులు సైతం ధాన్యాన్ని తేమ లేకుండా తీసుకురావాలని సూచించారు. అంతకుముందు నూతనంగా నిర్మించిన సొసైటీ సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. పీఏసీఎస్ చైర్మన్ రొఒడ్ల తిరుపతిరెడ్డి, సెస్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు, కార్యదర్శి రవీందర్‌రెడ్డి, ఐరెడ్డి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆటల్లోనూ రాణించాలి
సిరిసిల్లటౌన్: విద్యార్థులు చదువులతోపాటు ఆటపాటల్లోనూ రాణించాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ కోరారు. స్థానిక మినీస్టేడియంలో శనివారం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువజనోత్సవాల జిల్లా స్థాయి సెలెక్షన్స్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. 15 నుంచి 29 ఏళ్ల వరకు యువతీ, యువకులు జానపద నృత్యాలు, గేయాలు, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో రాణించారు. డీఈవో రమేశ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీబేగ్, వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ రాపెల్లి అరుణ, యువజన , క్రీడల శాఖ అధికారి రాందాసు, ఎస్జీఎఫ్ సెక్రటరీ దేవత ప్రభాకర్ పాల్గొన్నారు.
క్రమశిక్షణతో ఉండాలి
సిరిసిల్లకల్చరల్: క్రమశిక్షణతో లక్ష్యాన్ని సాధించాలని జిల్లా సంక్షేమాధికారి పి.లక్ష్మీరాజం తెలిపారు. సెస్ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణంలో శనివారం నూతన విద్యార్థులకు స్వాగతోత్సవం నిర్వహించారు. డీడబ్ల్యూవో లక్ష్మీరాజం మాట్లాడుతూ ఆడపిల్లలపై జరుగుతున్న దురాగతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సాంకేతికతను జ్ఞాన సముపార్జనకు వినియోగించుకోవాలని సూచించారు. మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ బోనాల రోజా, కళాశాల ప్రిన్సిపాల్ వనజకుమారి, అధ్యాపకులు మురళి, సీతారామ్, శ్రీనివాస్, సునీత, ప్రవీణ్ కుమార్, నవీన్‌కుమార్ అఫ్రోజ్ సుల్తానా, జబీ ఉల్లా, గంగరాజు, భూపాల్, అనిత పాల్గొన్నారు.
మిడ్‌మానేరులో 26 టీఎంసీలు
బోయినపల్లి(చొప్పదండి): శ్రీరాజరాజశ్వేర(మిడ్‌మానేరు) ప్రాజెక్టులో నీటిమట్టం 26.452 టీఎంసీలకు చేరింది. ఎల్‌ఎండీకి 8,880 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఎస్సారెస్పీ నుంచి 10,500 క్యూసెక్కుల మేర నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది.
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
వేములవాడఅర్బన్: సీసీ కెమెరాలతో నేరాలు నియంత్రణలో ఉంటాయని వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి అన్నారు. వేములవాడ పరిధిలోని ఫంక్షన్‌హాల్స్, హాస్పిటళ్ల యాజమాన్యాలతో శనివారం సమావేశమయ్యారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో లాభాలు, వాటి ఉపయోగాలు ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి వివరించారు. ఇటీవల చాలా కేసులు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా ఛేదించినట్లు వివరించారు. వేములవాడలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన హాస్పిటల్స్ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ అధికారులు, ఆస్పత్రి యాజమాన్యాలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment