ఆర్డీవో ఆఫీస్‌లో విజిలెన్స్ తనిఖీలు
● రెండో దఫా విచారణ ● పాత రేషన్‌డీలర్ల నిరసన ● ‘సాక్షి’లో వచ్చిన ‘లీడర్లే.. డీలర్లు’ కథనంపై స్పందన
సిరిసిల్ల: సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో శనివారం పౌరసరఫరాలశాఖ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధి కారులు తనిఖీలు చేశారు. సిరిసిల్ల డివిజన్‌లో 52 మంది రేషన్‌డీలర్ల నియామకాల్లో అక్రమాలు జరి గినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ జో క్యంతో రేషన్ డీలర్‌షిప్‌లను కట్టబెట్టారని పేర్కొంటూ ‘లీడర్లే.. డీలర్లు’ శీర్షినక ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించా రు. అదే రోజు పౌరసరఫరాలశాఖ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆర్డీవో ఆఫీస్‌లో రికార్డులు తనిఖీ చేశారు. మరోసారి శనివారం వచ్చి తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఏఎస్పీ స్థాయి అధికారి శశిధర్, డీఎస్పీ స్థాయి అధికారి ప్రభాకర్ తనిఖీల్లో పాల్గొన్న ట్లు సమాచారం. డీలర్లకు సంబంధించిన రికార్డులు సీజ్ చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లినట్లు తెలిసింది.
నియామకపత్రాలు అందించి..
మెరిట్ లిస్ట్ వెల్లడించి !
సిరిసిల్ల ప్రాంతంలో 52 రేషన్ డీలర్లకు సంబంధించిన నియామకపత్రాలను గోప్యంగా అందించిన రెవెన్యూ అధికారులు శనివారం డీలర్ల పరీక్షల ఫలితాలు, మెరిట్‌లిస్ట్ వెల్లడించడం విశేషం. రేషన్‌డీలర్ల పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించిన అధికారులు, ఆ పరీక్షల ఫలితాలు వెల్లడించకుండానే.. ఓరల్ ఇంటర్వ్యూలు మొక్కుబడిగా నిర్వహించిన అధికార పార్టీ నేతల అనుచరులకు, కుటుంబ సభ్యులకు డీలర్‌షిప్‌లను కట్టబెట్టారు. తాజాగా పరీక్షల మెరిట్‌లిస్ట్‌ను ఆలస్యంగా వెల్లడించడం రెవెన్యూ అధికారులు డొల్లతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. మరోవైపు గతంలో పొదుపు సంఘాల పేరిట రేషన్‌షాపులను నిర్వహించిన పాత రేషన్‌డీలర్లు శనివారం ఆర్డీవో ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు. ఈ నెల రేషన్ సరుకులకు తామే డీడీలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. సిరిసిల్ల ప్రాంతంలో రేషన్ షాపుల కేటాయింపుల్లో అక్రమాలపై బీఆర్‌ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. మొత్తంగా రేషన్ డీలర్ల నియామకాలు సిరిసిల్లలో చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment