6,172 కేసులు పరిష్కారం
సిరిసిల్లకల్చరల్/వేములవాడ: జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ కోర్టుల్లో శనివారం నిర్వహించిన అదాలత్‌లలో 6,172 కేసులు పరిష్కారమయ్యాయి. కక్షిదారులు రాజీకి మొగ్గుచూపడంతో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారానికి నోచుకున్నాయి. సివిల్, క్రిమినల్ కేసులతోపాటు ఆర్థిక సంబంధమైన కేసులు కూడా ఉన్నాయి. మొత్తం రూ.2కోట్ల 91లక్షల 41వేల 989 విలువైన కేసులు పరిష్కారానికి నోచుకున్నాయి. అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత ప్రారంభించి మాట్లాడారు. మూడు నెలలకోసారి మాత్రమే లోక్ అదాలత్ పరిమితం కాదని, కక్షిదారుల కోరిక మేరకు జిల్లా న్యాయస్థానంలో ప్రతి రోజూ అదాలత్ నిర్వహిస్తామని తెలిపారు. లోక్ అదాలత్ కేసుల పరిష్కరించుకుంటే అది శాశ్వత పరిష్కారమని, కోర్టు ఫీజులు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. విలువైన సమయం, డబ్బును వృథా చేసుకోకుండా రాజీ కుదుర్చుకోవాలని సూచించారు. సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాఽధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, న్యాయమూర్తులు ప్రవీణ్‌కుమార్, కావేటి సృజన, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, చింతోజు భాస్కర్ పాల్గొన్నారు.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు రావని జూనియర్ సివిల్ జడ్జి కిరణ్మయి తెలిపారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా వేములవాడ కోర్టు పరిసరాలను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుభ్రం చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి అవదూత రజనీకాంత్, ఏపీపీ విక్రాంత్ పాల్గొన్నారు.
రాజీకి మొగ్గుచూపిన కక్షిదారులు
అభినందించిన జిల్లా న్యాయమూర్తులు
Comments
Please login to add a commentAdd a comment