హైదరాబాద్‌లో సిరిసిల్ల చీరల ప్రదర్శన
సిరిసిల్ల: సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులు నేసిన చీరలను హైదరాబాద్ చేనేత, జౌళిశాఖ ఆఫీస్ లో శనివారం ప్రదర్శించారు. బతుకమ్మ చీరల స్థానంలో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు ఏటా రెండు చీరలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. గతానికి భిన్నంగా విభిన్నమైన డిజైన్లు, నాణ్యమైన చీరలు అందించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులు పవర్‌లూమ్స్‌పై ఉత్పత్తి చేసిన 45 శాతం కాటన్, 55 శాతం పాలిస్టర్ నూలు మిశ్రమంతో రూపొందించిన చీరలను జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్, టెస్కో జనరల్ మేనేజర్ అశోక్‌రావు సమక్షంలో ప్రదర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వైవిధ్యమైన డిజైన్లతో కూడిన చీరలను జౌళి శాఖ అధికారులు తెప్పిస్తున్నారు. పాలిస్టర్, కాటన్ మిశ్రమంగా త యారైన చీరలను ప్రాసెసింగ్ అవసరం లేకుండానే ఉత్పత్తి చేయవచ్చని వస్త్రోత్పత్తి దారులు స్పష్టం చేశారు. వస్త్రోత్పత్తిదారులు గోవిందు శ్రీకాంత్, వేముల దామోదర్, గడ్డం ప్రసాద్, శంకర్, భీముని రామచంద్రం ఉన్నారు.
రంగంపేటకు జాతీయస్థాయి గుర్తింపు
వీర్నపల్లి(సిరిసిల్ల): జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆరోగ్య విభాగంలో నామినేట్ అయిన మండలంలోని రంగంపేట గ్రామాన్ని శనివారం పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. రిజిస్టర్లను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డిప్యూటీ సీఈవో గీత సందర్శించారు. పంచాయతీ సెక్రటరీ పురుషోత్తం, హెల్త్ సూపర్‌వైజర్ పద్మ, ఎంపీహెచ్‌పీ చైతన్య, అంగన్‌వాడీ టీచర్ లక్ష్మీనర్సవ్వ, ఆశ జీవంతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment