సిరిసిల్ల: జిల్లాలో 72.62 శాతం ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే పూర్తయిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,531 ఎన్యుమరేషన్ బ్లాక్‌ల పరిధిలో 1,92,432 ఇళ్లు సర్వే చేయాల్సి ఉండగా నవంబర్ 17 నాటికి 1,39,743 ఇళ్ల సర్వే పూర్తి చేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,154 ఎన్యుమరేషన్ బ్లాక్‌ల పరిధిలో 1,44, 972 ఇళ్లకు 1,02,521 ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 377 ఎన్యుమరేషన్ బ్లాక్‌ల పరిధిలో 47,460 ఇళ్లకు 37,222 ఇళ్ల సర్వే చేసినట్లు వివరించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 70.72 శాతం, పట్టణ ప్రాంతాల్లో 78.43 శాతం, జిల్లా వ్యాప్తంగా 72.62 శాతం సర్వే పూర్తయిందని తెలిపారు. మిగిలిన ఇళ్లలో సైతం ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా సర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment