‘వర్కర్ టు ఓనర్’ ప్రకటించాలి
● 19, 20 తేదీల్లో సిరిసిల్లలో జిల్లా మహాసభలు ● సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్
సిరిసిల్ల: సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడకు వస్తున్న సందర్భంగా సిరిసిల్ల పవర్‌లూమ్ కార్మికులను య జమానులను చేసే ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని అమలు చేసేలా ప్రకటన చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీవై నగర్ అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవన్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. సీఎం వేములవాడకు వస్తున్న సందర్భంగా సిరిసిల్లలో నేతకార్మికులు, ఆసాముల ఆత్మహత్యల నివారణకు ఉపాధి చూపించేలా కార్యాచరణ ప్రకటించాలని కోరారు. 2023లో బతుకమ్మ చీరలు నేసిన కార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ డబ్బులు విడుదల చేయాలని, కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. డబుల్ ఇళ్ల కోసంఅర్హతలున్నా లక్కీడ్రాలో పేర్లు రాని వారికి మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇల్లు మంజూరుచేయాలని కోరారు. మధ్యమానేరు నిర్వాసితులకు పరిహారం అందించాలని కోరారు.
జిల్లా మహాసభలు విజయవంతం చేయండి
సిరిసిల్లలో నవంబర్ 19, 20 తేదీల్లో సీపీఎం జిల్లా మూడో మహాసభలు విజయవంతం చేయాలని మూశం రమేశ్ కోరారు. సీపీఎం జిల్లా కమిటీ స భ్యులు కోడం రమణ, సూరం పద్మ, సీపీఎం పట్టణ కార్యదర్శి గణేశ్, రమేశ్‌చంద్ర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment