సర్వేలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
షాద్‌నగర్‌రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్రసర్వేను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని హాజిపల్లిలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గృహజాబితా నమోదు ప్రక్రియను, నమోదు ప్రక్రియలో భాగంగా ఇళ్లకు అతికించిన స్టిక్కర్లను పరిశీలించారు. నమోదు ప్రక్రియలో తప్పులు దొర్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. నిర్లక్ష్యాన్ని, పొరపాట్లను ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. సర్వేపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. అధికారులకు పూర్తిగా సహకరించాలని కోరారు. కలెక్టర్ వెంట డివిజన్ ప్రత్యేకాధికారి రామారావు, తహసీల్దార్ పార్థసారధి, ఎంపీడీఓ బన్సీలాల్, ఎంపీఓ జయంత్‌రెడ్డి, ఎంఈఓ మనోహర్, ఏపీఎం నగేష్, పంచాయతీ కార్యదర్శి, సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లు ఉన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆయన ఆర్డీఓ సరితతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులు, డయాలసిస్ సెంటర్, ఇన్‌పేషెంట్, ఔట్ పేషెంట్ వార్డు, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. బాధితులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో పార్కింగ్ సమస్య, పారిశుద్ధ్య నిర్వహణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట డివిజన్ ప్రత్యేకాధికారి రామారావు, తహసీల్దార్ పార్థసారధి, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, హెల్త్ ఎడ్డుకేటర్ శ్రీనివాసులు, వైద్య సిబ్బంది ఉన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment