● వైభవంగా రథోత్సవం
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో కొలువైన మైసమ్మ తల్లి ఆలయ ఆవరణలో ఆదివారం రాత్రి నిర్వహించిన నిర్వహించిన పెద్ద తేరు రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. గర్భగుడిలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు రథంపై ఉంచారు. అనంతరం భక్తులు పోటీ పడుతూ అమ్మవారి రథాన్ని ఆలయ పరిసరాల్లో ఊరేగించారు. అమ్మవారి నామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. రథోత్సవం సందర్భంగా సీఐ శివప్రసాద్, ఎస్ఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్‌ట్రస్టీ శిరోలి, ఈఓ స్నేహలత, పీసీసీ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, ఆలయ నిర్వాహకులు భాస్కర్‌నాయక్, అరుణ్‌కుమార్, స్థానిక నాయకులు జవహర్లాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment