రాములుకు టీచర్ స్ఫూర్తి అవార్డు
కొందుర్గు: విద్యార్థులకు 22 ఏళ్లుగా అందిస్తున్న సేవలకుగాను జిల్లేడ్ చౌదరిగూడ మండలం రావిర్యాల ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం రాములుకు టీచర్ స్ఫూర్తి అవార్డు వరించింది. శారదా ఎడ్యూకేషన్ సొసైటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని భాస్కర ఆడిటోరియంలో నిర్వహించిన కార్యకమ్రంలో ఆయనకు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం రాములు మాట్లాడుతూ.. అవార్డుతో తనపై బాధ్యత మరింత పెరిగిందని.. పేదల విద్యాభివృద్ధికి పాటుపడతానన్నారు. అవార్డు అందజేసిన నిర్వాహకులకు, శాతవాహన వర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్, కమలామనోహర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పద్మశాలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా అశోక్
ఆమనగల్లు: పద్మశాలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా కొలుకులపల్లికి చెందిన మసన అశోక్ నియమితులయ్యారు. ఆదివారం సంఘం నిర్వహించిన కార్యాక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మచ్చ సుధాకర్‌రావు ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. పద్మశాలీల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
‘బుద్ధుడి నుంచి గద్దర్ వరకు..’ పుస్తకావిష్కరణ
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జీవీవీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకుడు బొజ్జ భిక్షమయ్య రచించిన ‘బుద్ధుడి నుంచి గద్దర్ వరకు..’, ప్రముఖ రచయిత డాక్టర్ కాలువ మల్లయ్య రచించిన ‘అస్పృశ్య యోధుడు’ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా హాజరైన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవ రావు మాట్లాడుతూ అభ్యుదయ శక్తులన్నీ ఏకం కావాలని, అందుకు తాను వారధిగా పని చేస్తానని చెప్పారు. కమ్యూనిస్టులు, అంబేడ్కరిస్టుల మధ్య అంతరం ఏర్పడిందని, ఆ అంతరాలను పూడ్చడానికి తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బి.ఎస్.రాములు తదితరులు పాల్గొన్నారు.
బహుజన
రాజ్యాధికారానికి కృషి
బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాములు
ఇబ్రహీంపట్నం రూరల్: బహుజన రాజ్యాధికారం సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పల్లాటి రాములు పిలుపునిచ్చారు. బీఎస్పీ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో కోశాధికారి బంగరిగళ్ల మహేందర్ సమక్షంలో ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్‌లో ఆదివారం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. జన కల్యాణ్ దివాస్‌ను ప్రారంభించిన అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు పల్లాటి రాములు మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజవకర్గంలో బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి కృషి చేద్దామన్నారు. అధికారం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షుడు వంగల కృష్ణ ప్రసాద్, ఉపాధ్యక్షుడు గుండె శ్రీనివాస్, మంచాల మండల నాయకులు మల్లన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment