సర్వేలో వివరాలు ఇచ్చినహైదరాబాద్ కలెక్టర్
బంజారాహిల్స్: సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణ కోసం చేపట్టిన సమగ్ర సర్వేలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తమ పూర్తి వివరాలను ఎన్యుమరేటర్కు అందజేశారు. ఆదివారం బంజారాహిల్స్ రోడ్డునెంబర్ –13లోని కలెక్టర్ బంగ్లాకు వెళ్లిన సూపర్వైజర్ బాహుసింగ్, ఎన్యుమరేటర్ శాంతిలక్ష్మీలు ఆయనకు 75 ప్రశ్నలతో కూడిన సర్వే ఫారాన్ని అందజేశారు. క్షుణ్ణంగా దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అందులోని అన్ని ప్రశ్నలకు వివరాలు నమోదు చేసి అధికారులకు అందజేశారు. సమగ్ర సర్వే జరుగుతున్న తీరును వారిని అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment